Home » తెలంగాణలో TRS పేరుతో మరో రాజకీయ పార్టీ..! BRSకు పెద్ద దెబ్బేనా..!

తెలంగాణలో TRS పేరుతో మరో రాజకీయ పార్టీ..! BRSకు పెద్ద దెబ్బేనా..!

by Bunty
Ad

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మరో తొమ్మిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాకాకుండా కేసీఆర్ గానీ ముందస్తుకు వెళితే ఏప్రిల్ లేదా మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముందస్తుకు వెళ్లాలా? లేదా? అనేది కేసీఆర్ ఆలోచన బట్టి ఉంది. కేసీఆర్ దాదాపు ముందస్తు ఆలోచన చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

read also : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

ఈ తరుణంలో బిఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగిలి చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. టిఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రక్షణ సమితి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తాను స్థాపించిన టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా మార్చిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ టైటిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి పేరుతో ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో కమిటీల నియామకం కూడా చేపట్టారు. అయితే టిఆర్ఎస్ పేరుతో మరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు.

READ ALSO : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

Visitors Are Also Reading