Home » మెడికో ప్రీతి  కన్నుమూత.. పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా ? 

మెడికో ప్రీతి  కన్నుమూత.. పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా ? 

by Anji

నిమ్స్ లో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూశారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండాకు చెందిన ప్రీతి వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో పీజీ అనస్థిషియా మొదటి సంవత్సరం చదువుతుంది. ఫిబ్రవరి 22న ఆమె హానికర ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలో చేరుకున్న ప్రీతికి తొలుత వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. ఆ తరువాత మెరుగైన వైద్య చికిత్సకోసం హైదరాబాద్ లోని నిమ్స్ కి తీసుకెళ్లారు. తొలుత వెంటి లెటర్ పై.. ఆ తరువాత ఎక్మో పై చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 

భారీ బందోబస్తు మధ్య ప్రీతి భౌతికకాయాన్ని స్వగ్రామం అయినటువంటి మొండ్రాయి గిర్నితండాకు తరలించారు. డాక్టర్ ప్రీతి మరణం చాలా బాధకరమని..  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రీతిని సైఫ్ వేధిస్తూ.. కించపరుస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కళాశాల బాధ్యులు స్పందిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.

Manam News

ప్రీతి మరణించడానికి కారణమైన నిందితుడికి కఠినమైన శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులను అరికట్టడం పై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలి. కొత్తగా కళాశాలలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకొని తమ కుటుంబ సభ్యుల మాదిరిగా ఆదరించాలి. వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపించడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలి” అని అన్నారు పవన్ కళ్యాణ్. 

Also Read :   తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి కోసం ఎన్టీఆర్ భార్య ప్రణతి ఏం చేసిందో తెలుసా ?

Visitors Are Also Reading