Home » కడప ఎంపీకి సీబీఐ నోటీసులు.. అందుకోసమేనా..?

కడప ఎంపీకి సీబీఐ నోటీసులు.. అందుకోసమేనా..?

by Anji
Published: Last Updated on
Ad

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి Ha త్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణలో భాగంగా అధికారులు సోమవారం కడప నుంచి పులివెందులకి వెళ్లారు. పులివెందుల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి గురించి తొలుత ఆరా తీశారు. భాస్కర్ రెడ్డి కార్యాలయానికి రాలేదని పార్టీ కార్యకర్తలు వివరించడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఆ తరువాత పార్టీ కార్యాలయం సమీపంలోనే ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటి పరిసరాలను అధికారులు పరిశీలించారు. 

Advertisement

వివేకా Ha త్య కేసు విచారణ సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణకు బదిలీ చేసిన విషయం విదితమే. వైఎస్ వివేకా కుమార్తె సునిత, ఆయన భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకొని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్ కి బదిలీ చేస్తున్నట్టు విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఆర్. షా వెల్లడించారు. అదేవిధంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.  

Also Read :  ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే 20 చిత్రాలు ఇవే..!

Advertisement

ఇదిలా ఉండగా.. తాజాగా వివేకా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులను జారీ చేసింది. వివేకా Ha త్య కేసుకు సంబంధించి జనవరి 24 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే పులివెందులలో అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పీఏ రాఘవరెడ్డికి ఈ నోటీసును అందించారు. మరోవైపు ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసు అందించడం ఇదే మొదటిసారి. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎంపీని ప్రశ్నించలేదు. అవినాష్ రెడ్డి తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డిని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీబీఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అదే కోణంలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నట్టు సీబీఐ వెల్లడించింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి  మాత్రం తాను విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు సమాచారం అందించారు. ముందుగా నిర్ణయించుకున్నటువంటి పలు కార్యక్రమాలుండడం వల్ల రాలేనని..   5 రోజుల తరువాత మీరు ఎప్పుడూ పిలిచినా హాజరు అవుతానని సోమవారం రాత్రి సీబీఐకి లేఖ రాశారు   ఎంపీ అవినాష్ రెడ్డి.

Also Read :  వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading