రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఇప్పటికే ఆయన ఫేమస్ పొలిటిషన్ గా పేరు సంపాదించుకున్నారు. ఆయన మాటలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. యువ నాయకుడు యూత్ కు రోల్ మోడల్ అని చెప్పవచ్చు.
Advertisement
Advertisement
అలాంటి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ పార్టీలో చాలా క్రియాశీలకమైన యువ నాయకుడిగా ముందుకు పోతున్నారు.. అయితే ఆయన గత కొంతకాలంగా ఎక్కడ సభలు జరిగిన హాజరవుతున్నారు. సభలను విజయవంతం చేస్తున్నారు.. అయితే తాజాగా కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి రాయలసీమ గర్జన సభకు హాజరయ్యారు.
మాట్లాడుతుండగానే అనుకోకుండా కళ్ళు తిరిగి కిందపడిపోయారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. కాసేపటికి తేరుకున్నారు సిద్ధార్థ్ రెడ్డి.. విరామం లేకుండా ఆయన సభలు సమావేశాలకు తిరగటం వల్ల ఈ విధంగా అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రిలోకి తరలించారు.
also read: