Home » 1st. మూవీతోనే స్టార్ డం తెచ్చుకున్న అబ్బాస్.. చివరికి పెట్రోల్ బంక్ లో పనిచేసే పరిస్థితి రావడానికి కారణం..!!

1st. మూవీతోనే స్టార్ డం తెచ్చుకున్న అబ్బాస్.. చివరికి పెట్రోల్ బంక్ లో పనిచేసే పరిస్థితి రావడానికి కారణం..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

అబ్బాస్ ఈ పేరు 1996 ఒక సంచలనం.. యూత్ ఐకాన్ గా పేరుపొందిన అబ్బాస్, అమ్మాయిల కలల రాకుమారుడు గా గుర్తు తెచ్చుకున్నారు.. ఆ సమయంలో ఎవరిని అడిగినా మీ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలి అని అడిగితే అబ్బాస్ లా ఉండాలి అని చెప్పేవారు. ఇక ఆయన హెయిర్ స్టైల్ అయితే ఎంతో పేరు పొందింది.. కొన్ని సెలూన్లకు అబ్బాస్ కటింగ్ సెలూన్ అని పేరు కూడా పెట్టారంటే ఎంత క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అంతలా యూత్ ని అట్రాక్ట్ చేసిన సినిమా ప్రేమదేశం. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో అబ్బాస్ యాక్టింగ్ చూసి మరో కొత్త స్టార్ తయారవుతున్నారని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఇక దర్శక నిర్మాతలు ఆయన ఇంటి ముందు క్యూ కట్టారు.

Advertisement

ALSO READ;ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే ?

Advertisement

దాదాపుగా రెండు సంవత్సరాలకు సరిపడా సినిమాలు కూడా సైన్ చేయించుకున్నారు. ఇక ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.. ప్రేమదేశం హిట్ తర్వాత ఆయన కథల విషయంలో ఏ మాత్రం ఆలోచించకుండా ఆయన క్యారెక్టర్ కి సెట్ కానటువంటి సినిమాలను ఒప్పుకున్నారు. ఆ తర్వాత వీఐపీ సినిమాలో నటించిన ఆయనకు తగ్గ క్యారెక్టర్ అయితే కాదు. ఈ మూవీ తర్వాత జీన్స్ సినిమా చేయాలనుకున్నాడు. కాని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా మిస్ అయింది. మరో సూపర్ హిట్ మూవీ కథ లుక్కు మరియాది కూడా వదులుకున్నాడు. తనకు కథ సూటు కాని అన్ని సినిమాలు ఒప్పుకొని, చిన్న పాత్రలు చేసే రేంజ్ కు దిగజారిపోయాడు. ప్రేమదేశం వదిలేస్తే ఏ సినిమాలో అయినా ఏ క్యారెక్టర్ అయినా సరే ఒకే విధంగా నటించారు అబ్బాస్. నటనలో ఏ మాత్రం స్టైల్ చూపించలేకపోయారు.

దీంతో అతని పతనం మొదలైంది. సెకండ్ హీరోగా మరియు సైడ్ క్యారెక్టర్లు ఒప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా 60 సినిమాల్లో నటించినా కానీ ప్రేమదేశం సినిమాలో నటించినంత ఎఫెక్ట్ మాత్రం చూపించలేకపోయాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న అబ్బాస్ తన రూటు మార్చాడు. హీరోలా బ్రతికిన ఆయన చెన్నైలో చిన్న పాత్రలు చేసుకుంటూ అవమానాలు భరించలేక న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడికి వెళ్లిన కొత్తలో తనకి ఇష్టమైన పనులన్నీ చేశాడు. మొదట పెట్రోల్ బంకులో పనిచేశాడు. ఆ తర్వాత మెకానిక్ గా కూడా పని చేశాడు. కొన్నాళ్లు కన్స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్ గా కూడా చేశాడు. ఈ విధంగా ఆయన కష్టపడుతూ చివరికి ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు.

ALSO READ;రాజమౌళి to ప్రశాంత్ నీల్ దేశమంతటా క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ వీళ్ళే..!!

 

Visitors Are Also Reading