ప్రస్తుతం అధిక బరువు అనేది ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన సమస్య గా మారింది. ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడంతో ఈ సమస్య కాస్త ఆందోళనకరంగా మారింది. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలంటే ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ వ్యాయామం చేయాలి. జిమ్, జిమ్నాస్టిక్ యోగా లాంటివి వయసులో ఉన్న వారు అయితే ఈజీగా చేయగలరు. వయసు పైబడిన వారు పిజికల్ యాక్టివిటీ చేయడం చాలా కష్టమే. వారిని దృష్టిలో ఉంచుకొని అందరూ పాటించే సులభమైన మార్గాలను నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొన్ని కిలోల బరువు తగ్గొచ్చు. ఇందులో కష్టమైన నియమాలు ఏమీ లేవు. బరువు తగ్గాలంటే 80 శాతం ఆహారం, 20 శాతం వ్యాయామం అని తరుచుగా చెబుతుంటారు. చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రయత్నిస్తే వచ్చే పలితాలు చూస్తే నమ్మకం కలుగుతుంది. ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గేందుకు ఎంతో ప్రభావవంతంగా పని చేసే ఐదు మార్గాల గురించి తెలుసుకుందాం.
Advertisement
స్వీట్లు :
సాధారణంగా అధిక బరువును తగ్గించుకునే పనిలో తొలుత చేయాల్సి పని కృత్రిమ చక్కెరతో చేసే తీపి పదార్థాలను తినడం మానేయాలి. చక్కరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీవక్రియకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వరీర బరువును డైరెక్ట్ గా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ మేము తీపి తినకుండా ఉండం చాలా కష్టం. మా వల్ల కాదు అనుకునే వారు పంచదారకు బదులుగా బెల్లం, తేనె మితంగా వాడవచ్చు.
మైదా :
Advertisement
బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న వారు మైదా పిండితో చేసే పదార్థాలు తినడం పూర్తిగా మానేయాలి. దీంతో చేసే పదార్థాలు అంటే బ్రెడ్, బన్, నాన్, పాస్తా లాంటివి అస్సలు తినకూడదు. దీనికి బదులుగా ఊక ఉన్న గోధుమ పిండి ఉపయోగించవచ్చు. దీంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీరు బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయం చేస్తుంది.
గ్రీన్ టీ :
బరువు తగ్గాలని అనుకుంటే కచ్చితంగా రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తప్పక తాగండి. గ్రీన్ టీ మీ జీవక్రియను బూస్ట్ చేయడమే కాకుండా.. శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపిస్తుంది. దీంతో శరీరం డిటాక్స్ బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
రిపైన్డ్ ఆయిల్ :
ఇంట్లో ఆహారం వండేటప్పుడు నూనెను ముఖ్యంగా రిఫైన్డ్ అయిల్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. రిఫైన్డ్ ఆయిల్ బరువు పెరగడానికి సహకరిస్తుందని గుర్తుంచుకోవాలి. దీనికి బదులుగా ఆవనూనె, వేరు శనగ నూనె, రైస్ బ్రౌన్ ఆయిల్ వంటివి వినియోగించవచ్చు.
వేడి నీరు :
ప్రతి రోజు ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో వేడి నీరు తాగాలి. ఇలా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. తద్వారా ఆరోగ్యకరంగా సునాయసంగా బరువు తగ్గడంలో ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో టాక్సిన్ లు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న చల్లని నీటిని పోకుండా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వులు తొలిగిపోతాయి.
Also Read : ఈ జ్యూస్ తాగితే పోషకాలతో పాటు ఎన్నో సమస్యలకు చెక్..!