Home » వేదిక ఒకటే.. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు గీతాలు.. ఆసక్తికర ఘటన ఎక్కడంటే..?

వేదిక ఒకటే.. రవీంద్రనాథ్ ఠాగూర్ రెండు గీతాలు.. ఆసక్తికర ఘటన ఎక్కడంటే..?

by Sravanthi
Ad

ఎంతో ఉత్కంఠగా సాగిన ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ కు ముందుగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది..ఆట ప్రారంభించేముందు రెండు టీములు వారి వారి జాతీయ గీతాలు ఆలపించాయి.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. ఈ రెండు దేశాల జాతీయ గీతాలను రాసింది ఒకరే కావడం మరో విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న కలం యోధుడు రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశ జాతీయగీతమైన “జనగణమన” ఠాగూర్ బెంగాలీలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయగీతమైన “అమర సోనార్ బంగ్లాను” కూడా బెంగాల్ విభజన నిరసిస్తూ 1905లో రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఈ విధంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది..

also read;మహిళల ఐపీఎల్ లోకి ఆర్సీబీ ఎంట్రీ..?

Advertisement

Advertisement

ఇండియా విజయం:
బంగ్లాదేశ్ తో జరిగినటువంటి ఉత్కంఠ పోరులో ఐదు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్టే. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. దీని తర్వాత బరిలోకి దిగిన బంగ్లాదేశ్ లక్ష్య చేదనలో ప్రారంభంలో చెలరేగినప్పటికీ, వర్షం తర్వాత కాస్త తడబడింది. టీమిండియా బౌలర్లు దాటికి తట్టుకోలేక వరుస వికెట్లను కోల్పోయింది. దీంతో ఐదు పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

also read:

Visitors Are Also Reading