Home » Unstoppable 2 : బాలయ్య టాక్ షోకి వైఎస్ షర్మిల..?

Unstoppable 2 : బాలయ్య టాక్ షోకి వైఎస్ షర్మిల..?

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైనటువంటి బాలకృష్ణ ఫస్ట్ సీజన్ ని మించి అన్ స్టాపబుల్ సీజన్ 2 ని సక్సెస్ చేయడానికి తనవంతు కష్టపడుతున్నారనే చెప్పవచ్చు.  తనపై తాను పంచ్ లు వేసుకుంటూ టాక్ షోలో బాలయ్య ఆకట్టుకుంటున్నారు.  ఇప్పటికే మొదటి షోకు చంద్రబాబు, లోకేశ్ హాజరు అయ్యారు. దీంతో సినిమా వాళ్లే కాదు.. పాలిటిక్స్ నాయకులు కూడా ఈ షోకి హాజరు కావచ్చని ప్రూవ్ చేశారు.  రెండో షో కి సిద్దు జొన్నలగడ్డ, ఫలక్ నుమా దాస్ యంగ్ హీరోలు హాజరయ్యారు. మధ్యలో ఒక వారం గ్యాప్ తరువాత ఈ శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కు శర్వానంద్, అడివిశేష్ గెస్ట్ లుగా అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో కోసం ప్రేక్షకులు ఎంతో  ఆసక్తిగా ఎదురుచూస్తుండడం గమనార్హం. ఈ షో తరువాత ఎపిసోడ్ కి వైెఎస్ షర్మిల గెస్ట్ గా హాజరుకానున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో వైెెఎస్సార్టీపీ అధికారంలోకి తీసుకుని రావాలని గత కొద్ది నెలలుగా షర్మిల ఎంతగానో కష్టపడుతున్నారు. పార్టీలో కీలక నేతలు ఎవ్వరూ లేకపోవడంతో ఆ పార్టీని ప్రముఖ తెలంగాణ నేతలు పట్టించుకోవడం లేదు. షర్మిల పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం తేలిక కాదని కూడా కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. షర్మిల పాలిటిక్స్ గా మరింత ఎదిగేలా అడుగులు వేస్తున్నారు. బాలయ్య అన్ స్టాపబుల్ షో నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందితే షర్మిల నో చెప్పే అవకాశాలు దాదాపు ఉండవని తెలుస్తోంది.  

Also Read :

ఇందుకు ఆహా నిర్వాహకలు కూడా భారీగానే ప్లాన్ చేశారని ఈ ఎపిసోడ్ తో ఈ షో రేంజ్ మారిపోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య షోకు షర్మిల హాజరు కానున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ షోకు షర్మిల హాజరైతే మాత్రం పాలిటికల్ వర్గాల్లో కూడా సంచలనమవుతుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కి షర్మిల ఈ షోకు హాజరు కావడం ఏమాత్రం ఇష్టం ఉండదనే సంగతి తెలిసిందే. షర్మిల అన్ స్టాపబుల్ సీజన్ 2కి హాజరవుతారో లేదో త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. మరోవైపు విక్టరీ వెంకటేష్ కూడా ఈ షోకి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తరువాత ఎపిసోడ్ కి ఎవరు హాజరు కానున్నారో మరికొద్దిరోజుల్లోనే క్లారిటీ రానుంది. 

Also Read :  Avatar 2 Trailer : అవతార్ 2 ట్రైలర్.. విజువల్స్ వండర్

 

Visitors Are Also Reading