ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించి మెప్పించారు. వీరిద్దరూ హీరోలు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈసినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read : మోకాళ్ళ పై తిరుపతి మెట్లు ఎక్కిన ఆ హీరోయిన్
Advertisement
ఈ పిక్చర్ పిరియాడిక్ యాక్షన్ దేశవిదేశాల నుంచి ప్రశంసలు దక్కాయి. గతంలో హాలీవుడ్ మ్యాగజైన్ సైతం ఆర్ఆర్ఆర్ మూవీ కి ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని అభిప్రాయపడుతూ నివేదికలు ఇవ్వడం విశేషం. తాజాగా ఈ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయనున్నారు. సౌత్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. దీంతో త్వరలోనే ఆర్ఆర్ఆర్ అక్కడ రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి,ఎన్టీఆర్ జపాన్ కు చేరుకున్నారు.
Advertisement
Also Read : సమంత బాటలోనే ప్రియమణి..? భర్తతో విడాకుల దిశగా అడుగులు..!
జపాన్ ప్రేక్షకుల కోరిక మేరకు ఈ అక్టోబర్ 21న ఈ మూవీ భారీ స్థాయిలో విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ జపాన్ క్యాపిటల్ టోక్యో లో పాపులర్ లగ్జీరియస్ హోటల్ అయినా ది రిట్జ్ కార్ట్లన్ లో బస చేస్తున్నారు. అక్కడ హౌస్ కీపింగ్ టీమ్ తారక్ కు పెద్ద ఫ్యాన్స్. తారక్ ను చూడగానే ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు అంటూ ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించారు. తారక్ మీద ఉన్న ప్రేమతో రాసిన లెటర్స్, గ్రీటింగ్ కార్డ్స్ ఆయనకు చూపించారు. హౌస్ కీపింగ్ టీం తన మీద చూపించిన ప్రేమాభిమానాలకు యంగ్ టైగర్ ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : శ్రీకాంత్ గురించి సీనియర్ హీరోయిన్ లైలా ఏమందో తెలుసా ?