సీనియర్ హీరోయిన్ లైలా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో లైలా కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే చాలా మంది అభిమానులు థియేటర్స్ కి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. లైలాను తెలుగు తెరపై పరిచయం చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి. 1997లో ‘ఎగిరే పావురమా’ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ గోవా బ్యూటీ. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. సినిమా మొత్తం హీరోని ‘కొలబద్ద’ అంటూ ఆట పట్టిస్తుందిఈ హీరోయిన్. పిల్లలతో పద్యం కూడా పాడిస్తుంది. ఈ సీన్ ఇప్పటికీ నవ్వులు పూయిస్తుంది. అయితే సినిమాలో మాదిరిగా బయటకూడా శ్రీకాంత్ నీ అలానే ఆట పట్టిస్తుందట లైలా.
Also Read : నయనతార సరోగసి కేసులో అడ్డంగా దొరికిన డాక్టర్
Advertisement
Advertisement
ఇప్పటికీ శ్రీకాంత్ ని ‘కొలబద్దస అనే పిలుస్తుందట. 16 ఏళ్ల తర్వాత ‘సర్దార్’ ద్వారా మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది లైలా. కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిత్ర బృందం తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈవెంట్ లో పాల్గొన్న లైలాను స్టేజీ మీదకు పిలుస్తూ.. ‘కొలబద్ద’ అని పిలిచారు యాంకర్.
Also Read : తెలుగులో గొప్ప హీరోయిన్ కానీ కన్నడలో సౌందర్య ఎందుకు ఫెయిల్ అయ్యారు ?
దీంతో లైలా పగలబడి నవ్వింది. ఆ డైలాగ్ ని గుర్తు చేస్తూ.. ఇప్పటికి శ్రీకాంత్ ని ఆ పేరుతోనే పిలుస్తానని చెప్పుకొచ్చింది. ఒక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘సర్దార్ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నేను నటించిన శివ పుత్రుడు దీపావళికి విడుదలైన ఘన విజయం సాధించింది. సర్దార్ కూడా అదే రోజు వస్తోంది. దీపావళి నా పుట్టినరోజు కూడా కార్తీక్ గారు అద్భుతంగా నటించారు. చాలా మంచి సినిమాని తీశారు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలి’ అని చెప్పుకొచ్చారు.
Also Read : ఆర్జే సూర్య అంతటి కష్టాలను అనుభవించారా ?