Home » ఈరోజు నుంచి ఈ బ్యాంక్ క‌నుమ‌రుగు.. క‌స్ట‌మ‌ర్లు అలెర్ట్‌గా ఉండండి..!

ఈరోజు నుంచి ఈ బ్యాంక్ క‌నుమ‌రుగు.. క‌స్ట‌మ‌ర్లు అలెర్ట్‌గా ఉండండి..!

by Anji
Ad

భార‌త రిజ‌ర్వు బ్యాంకు తాజాగా ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో బ్యాంకు లైసెన్స్ ర‌ద్దు చేసింది. ఈసారి ఆర్‌బీఐ పూణే కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న సేవా వికాస్ కో ఆప‌రేటివ్ బ్యాంకు లైసెన్స్ ని క్యాన్స‌ల్ చేసింది. ఆర్‌బీఐ ఈ మేర‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. అక్టోబ‌ర్ 10న ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బ్యాంకు వ‌ల్ల స‌రిపడినంత మూల‌ధ‌నం లేద‌ని ఆర్బీఐ పేర్కొంది. బ్యాంకు వ‌ద్ద స‌రైన రాబ‌డి అంచ‌నాలు కూడా లేవ‌ని తెలిపింది. అందుకే లైసెన్స్ ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

Advertisement

సేవా వికాస్ కో ఆప‌రేటివ్ బ్యాంకు బ్యాంకింగ్ సేవ‌లు అక్టోబ‌ర్ 11 నుంచి బంద్ అవుతాయ‌ని ఆర్‌బీఐ తెలిపింది.  క‌స్ట‌మ‌ర్లు ఇక‌పై ఇవాళ్టి నుంచి ఎలాంటి బ్యాంకింగ్ సేవ‌లు పొంద‌లేరు. దీనివ‌ల్ల బ్యాంకు ఖాతాదారుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం పడే అవ‌కాశం ఉంది. బ్యాంకింగ్ రెగ్యులేష‌న్ యాక్ట్ 1949లోని సెక్ష‌న్ 11 (1), సెక్ష‌న్ 22 (3) (డీ), సెక్ష‌న్ 56 ప్ర‌కారం.. ఈ బ్యాంకు లైసెన్స్‌ని ర‌ద్దు చేస్తున్నామ‌ని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంకు సెక్ష‌న్ 22(3) (ఏ), 22 (3) (బి), 22 (3)సి, 22 (3) (ఇ) వంటి నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించింద‌ని వెల్ల‌డించింది. బ్యాంకు కార్య‌క‌లాపాల‌ను అదేవిధంగా కొన‌సాగితే బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డే అవ‌కాశ‌ముంద‌ని ఆర్‌బీఐ పేర్కొంది. డిపాజిట్ దారులు, ప్ర‌జా ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌ని అందుకే త‌క్ష‌ణ‌మే ఈ బ్యాంకు లైసెన్స్ ర‌ద్దు చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది.

Advertisement

Also Read :  కంప్యూట‌ర్ టైపింగ్‌తో వేళ్లు నొప్పులా ? ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..!

బ్యాంకు లైసెన్స్ ర‌ద్దు నేప‌థ్యంలో ఇక‌పై కో ఆప‌రేటివ్ బ్యాంకు ఎలాంటి బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్ట‌కూడ‌దు. క‌స్ట‌మ‌ర్ల నుంచి డిపాజిట్లు స్వీక‌రించ‌వ‌ద్దు. రుణాలు ఇవ్వ‌కూడ‌దు. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్లు చేయ‌కూడ‌దు. ఇలా ఏ ప‌ని చేయ‌డానికి అవ‌కాశం లేదు. బ్యాంకు లైసెన్స్ ర‌ద్దు నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్ల‌పై ప్ర‌స్తుతం కొంత మేర‌కు ప్ర‌భావం ప‌డ‌వ‌చ్చు. వారి డ‌బ్బులు మాత్రం ఎక్క‌డికీ పోవు. బ్యాంకులో డ‌బ్బులు దాచుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ వారి డ‌బ్బులు వెన‌క్కి వ‌స్తాయి. ఈ విష‌యంలో ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ స్కీమ్ కింద బ్యాంకు డిపాజిట్ దారులంద‌రికీ డ‌బ్బులు వెన‌క్కి వస్తాయి. రూ.5లక్ష‌ల వ‌ర‌కు డ‌బ్బులు దాచుకున్న వారికి పూర్తి డ‌బ్బులు ల‌భిస్తాయి. ఇక ఆ పైన డిపాజిట్ చేసుకొని ఉంటే వారికి కూడా రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌స్తాయి. అందువ‌ల్ల బ్యాంకులో డ‌బ్బులు దాచుకునేట‌ప్పుడు ఆర్థిక ప‌రిస్థితులు గ‌మ‌నించాలి. లేనియెడ‌ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

Also Read :  పాన్ కార్డు పోయిందా..? అయితే డూప్లికేట్ కోసం ఇలా అప్లై చేసుకోండి..!

Visitors Are Also Reading