Home » మెళ్ళిగా కలెక్షన్స్ ను పెంచేస్తున్న లైగర్..!

మెళ్ళిగా కలెక్షన్స్ ను పెంచేస్తున్న లైగర్..!

by Azhar
Ad

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా లైగర్. ఈ సినిమాకు మాస డైరెక్టర్ గా మంచి పేరు అనేది ఉన్న పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేసారు. అయితే పూరీ, విజయ్ కాంబో అనగానే అందరూ ఈ సినిమాపైన భారీ అంచనాలు అనేవి పెట్టుకున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండేను విజయ్ కు జంటగా తీసుకోగా.. ఇంటర్నేషనల్ స్టార్ మైక్ టైసన్ ను సినిమాలోకి తీసుకువచ్చారు.

Advertisement

దాంతో అంచనాలు అనేవి ఆకాశంలోకి వెళ్లాయి. కానీ ఫలితం మాత్రం పాతాళానికి పడిపోయింది. విడుదలైన రోజు మొదటి షో నుండే ప్లాప్ టాక్ అనేది ఈ సినిమా తెచ్చుకుంది. దాంతో ఈ సినిమాకు భారీ నష్టాలూ అనేవి తప్పు అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇంత డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా తర్వాత కూడా లైగర్ సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే అందరూ షాక్ కావాల్సిందే.

Advertisement

అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఇప్పటివరకు 70 కోట్ల గ్రాస్ ను అలాగే 31 కోట్ల షేర్ ను అందుకుంది. మొత్తం డిజాస్టర్ అయిన సినిమాకు ఈ మేర కలెక్షన్స్ అనేవి రావడం మాములు విషయం కాదు అనే చెప్పాలి. ఇక ఇందుకు కారణం కేవలం విజయ్ దేవరకొండ యొక్క క్రేజ్ అని అంటున్నారు విశ్లేషకులు. ప్లాప్ సినిమాకే విజయ్ ఇంత రాబడితే ఈ సినిమా హిట్ అయితే ఇంకా ఎంత వచ్చేదో అని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

అశ్విన్ జట్టులోకి.. ఎందుకో తెలుసా..?

మాజీలకు అందరికి కలిపి పంచ్ ఇచ్చిన విరాట్…!

Visitors Are Also Reading