Home » ఈ సినిమాను వదులుకొని ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట.. నవ్వుకున్న ఏఎన్ఆర్..!

ఈ సినిమాను వదులుకొని ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట.. నవ్వుకున్న ఏఎన్ఆర్..!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏ ఎన్ ఆర్, ఎన్టీఆర్ సినిమాలు అంటే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అవ్వాల్సిందే.. వారి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసేవారు.. దానికి ప్రధాన కారణం వారి నటనా చాతుర్యం.. ముఖ్యంగా ఎన్టీఆర్ హీరోగా చేయని పాత్ర అంటూ లేదు.. ఎన్నో సంచలనాత్మకమైన చిత్రాలలో నటించారు కృష్ణుడిగా రాముడిగా, రావణుడిగా, భక్తుడిగా, రౌడీ, పోలీస్, న్యాయమూర్తి,లాయర్ ఇలా మరెన్నో పాత్రలు చేసి మెప్పించారు అన్న ఎన్టీఆర్. ఎన్ని సినిమాలు చేసినా ఎన్టీఆర్ ను ఆ ఒక్క సినిమా మాత్రం చాలా బాధ పెట్టిందట.. అదేంటంటే.. అదే అక్కినేని నాగేశ్వరరావు నటించిన భక్త తుకారాం మూవీ.. ఈ సినిమాని ముందుగా దుక్కిపాటి మధుసూదనరావు డైరెక్ట్ చేశారు.. ఇది డబ్బింగ్ కథతో వచ్చిన చిత్రం..

Advertisement

 

ALSO READ:మహేష్ బాబుతో పూరీ ఆ రెండు సినిమాల సీక్వెల్..?

Advertisement

అయితే ఈ సినిమా కథ ముందుగా అన్న ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందట.. కానీ ఆయన అప్పటికే చాలా బిజీగా ఉండడంతో కుదరదని చెప్పారట.. కానీ డైరెక్టర్ రెండు నుంచి మూడు నెలల వరకు ఎదురు చూశారట.. పైగా ఇందులో అంజలీదేవి నటిస్తుందని మంచి పేరు కూడా వస్తుందని చెప్పారట.. దీంతో ఎన్టీఆర్ చేద్దాం చేద్దాం అనుకుంటూ వస్తున్నారట.. ఈ క్రమంలోనే నిర్మాత తొందర పెట్టడంతో దర్శకుడు అక్కినేని సంప్రదించారు.. దీంతో నాగేశ్వరరావు ఓకే చెప్పడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి పోయింది.. అప్పట్లో ఈ మూవీ నాలుగు నెలల్లో పూర్తి కావడం మరో విశేషం.. ఈ సినిమా ఏం ఆడుతుంది అని చాలామంది అనుకున్నారట..

కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేసిందట.. ఈ మూవీ నుంచి ఏఎన్ఆర్ కు చాలా కలిసి వచ్చిందని.. ఆయన కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారని.. ఈ సినిమా హిట్ అవడంతో విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఒకింత ఆవేదనకు గురయ్యారని సమాచారం.. ఒక సందేశాత్మక చిత్రాన్ని చేజార్చుకున్నానని ఆవేదన చెందారట.. అయినా తన తోటి నటుడు అక్కినేనిని మాత్రం అభినందించకుండా ఉండలేకపోయారట.. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమా వచ్చిన కాదనకుండా చేసుకుంటూ వచ్చారని సమాచారం.

ALSO READ:రోడ్డుపైన డ‌బ్బులు దొరికితే తీసుకోవ‌చ్చా..? ఇది త‌ప్ప‌క తెలుసుకోండి..!

Visitors Are Also Reading