Home » రోడ్డుపైన డ‌బ్బులు దొరికితే తీసుకోవ‌చ్చా..? ఇది త‌ప్ప‌క తెలుసుకోండి..!

రోడ్డుపైన డ‌బ్బులు దొరికితే తీసుకోవ‌చ్చా..? ఇది త‌ప్ప‌క తెలుసుకోండి..!

by Anji
Ad

సాధార‌ణంగా మ‌నం రోడ్డుపై వెళ్తున్నస‌మ‌యంలో మ‌న‌కు అక్క‌డ‌క్కడ చిల్ల‌ర నాణాలు క‌నిపిస్తుంటాయి. ఇలా చిల్ల‌ర నాణాలు క‌నిపిస్తే చాలా మంది వాటిని తీసుకోవ‌డానికి వెన‌క‌డుగు వేస్తుంటారు. అదేవిధంగా కొంద‌రూ డ‌బ్బులు దొరికాయ‌న్న ఉద్దేశంతో వాటిని తీసుకుంటారు. చిల్ల‌ర నాణాలు క‌నిపించిన‌ప్పుడు చాలా మంది వాటిని తీసుకోవ‌డానికి ఆలోచిస్తే కొంద‌రూ మాత్రం అలాంటి తీసుకోవ‌డానికి ఏమాత్రం ఆలోచించ‌రు. ఇలా రోడ్డుపై ప‌డ్డ డ‌బ్బులను తీసుకోవ‌డం అస‌లు దేనిని సూచిస్తుంది.


ఇక ఆ విష‌యానికి వ‌స్తే.. తొలుత మ‌న‌కు రోడ్డుపై ఎక్క‌డ ఉన్నా చిల్ల‌ర నాణాలు క‌నిపిస్తున్నాయంటే చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ఏదైనా స్మ‌శాన వాటిక ఉందో లేదో గ‌మ‌నించుకోవాలి. ఒక మృత‌దేహాన్ని అంతిమ యాత్ర తీసుకెళ్తున్న స‌మ‌యంలో చిల్ల‌ర వేస్తూ వెళ్తారు. మ‌న‌కు రోడ్డుపై చిల్ల‌ర క‌నిపించిన‌ప్పుడు తొలుత ఆ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌ను ప‌రిశీలించాలి. ఒక‌వేళ స్మ‌శాన వాటిక ప‌రిస్థితులు మ‌న‌కి క‌నిపించ‌క‌పోతే ఆ చిల్ల‌ర డ‌బ్బుల‌ను తీసుకొని దేవుని స‌న్నిధిలో వేసి డ‌బ్బులు పోగొట్టుకున్న వారికి మంచి జ‌ర‌గాల‌ని ప్రార్థించి డ‌బ్బుల‌ను హుండిలో వేయాలి. అయితే దొరికిన డ‌బ్బును తీసుకోవ‌డం వ‌ల్ల పోగొట్టుకున్న వారి ఆవేద‌న బాధ మ‌న‌కు క‌లుగుతాయి.ఇక ఆల‌యానికి వెళ్లే ప‌రిస్థితి లేన‌ప్పుడు దొరికిన డ‌బ్బును దారిలో బిక్షం వేసి వెళ్లిన మీకు ఎలాంటి పాపం లేకుండా పుణ్యం క‌లుగుతుంది.

Advertisement

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  హీరో రాజ‌శేఖ‌ర్ త‌మ్ముడు బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!


అందుకే రోడ్డుపై దొరికిన డబ్బుల‌ను ఎప్పుడూ మ‌న వ‌ద్ద ఉంచుకోకూడ‌దు. కొంద‌రిలో ల‌క్ష్మీదేవి మ‌న ఇంటికి వ్తే మ‌నం ఎందుకు తీసుకోకూడ‌ద‌నే ప్ర‌శ్న వినిపిస్తుంటుంది. అయితే రోడ్డుపై డ‌బ్బులు మ‌న‌ల్ని వెతుక్కుంటూ మ‌న‌కు దొరికిన డ‌బ్బు మ‌నం క‌ష్ట‌ప‌డి సంపాదించింది కాదు. అలా డ‌బ్బులు పోగొట్టుకున్న వారు ఎక్క‌డో ఉండి డ‌బ్బు పోయింద‌ని ఎంతో మ‌నోవేద‌న చెందుతుంటారు. మ‌నం ఆ డ‌బ్బులు తీసుకుంటే డ‌బ్బుతో పాటు వారి వేదన‌, బాధ మ‌న‌కు వ‌స్తుంది. దొరికిన డ‌బ్బులు తీసుకోకుండా దేవుడి స‌న్నిదిలోనే వేసి పోగొట్టుకున్న వారికి మంచి జ‌ర‌గాల‌ని కోర‌డం మంచిది. అంతేకాదు.. రోడ్డుపై ప‌డిన డ‌బ్బులు తీసుకోవ‌డం మంచిది కాద‌ని పండితులు పేర్కొంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  కార్తికేయ-2 ప్రమోషన్స్ కు అనుపమ దూరం.. ఎందుకంటే..?

Visitors Are Also Reading