క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ లో తన మార్క్ అనేది చూపించుకోవాలని చూస్తున్నాడు. అయితే ఐపీఎల్ లో రెండేళ్లుగా ముంబై ఇండీస్ జట్టులో ఉంటుంది అర్జున్ కు ఒక్క మ్యాచ్ లో అవకాశం అనేది ఇవ్వలేదు ఆ యాజమాన్యం. ఇక ఐపీఎల్ లో కాకుండా దేశవాళీ క్రికెట్ లో కూడా అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టు తరపునే ఆడుతున్నాడు. కానీ అక్కడ కూడా అతనికి అవకాశాలు అనేవి రాలేదు.
Advertisement
గత ఏడాది కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే అతనికి అవకాశం అనేది ఇచ్చారు. అందుకే ఎక్కువ క్రికెట్ ఆడాలి అనే ఉద్దేశ్యంలో అర్జున్ ఇప్పుడు ముంబై జట్టు నుండి బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ముంబై జట్టును వీడు గోవా జట్టులో చేరడానికి తనకు ఎన్ఓసీ అనేది ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై సచిన్ క్రికెట్ ఆడకామి స్పందించింది.
Advertisement
ఈ నిర్ణయం అనేది అర్జున్ కెరియర్ లో ఓ మలుపుగా ఉంటుంది. అతను గోవా తరపున ఉంటె ఎక్కువ మ్యాచ్ లు ఆడే అవకాశముంది అని పేర్కొంది. ఇక ఇదే విషయంపై గోవా క్రికెట్ అసోసియేషన్ కూడా స్పందిస్తూ.. మేము ఇప్పుడు జట్టులో ఓ లెఫ్టర్మ్ బౌలర్ కోసం చూస్తున్నాము. కాబట్టి అర్జున్ మా జట్టులోకి వస్తే హెల్ప్ అవుతుంది. అతను వచ్చిన తర్వాత అతని ప్రదర్శన అనేది చూసి జట్టులోకి ఎంపిక అనేది ఉంటుంది అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి :