Home » స‌ముద్ర తీరంలో వింత జీవి ద‌ర్శ‌నం.. అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా..?

స‌ముద్ర తీరంలో వింత జీవి ద‌ర్శ‌నం.. అది ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా..?

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  వింత జీవుల భ‌యం రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా స‌ముద్ర గ‌ర్భంలో త‌ర‌చూ విషాద‌క‌ర‌మైన జీవులు క‌నిపిస్తుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. సాధార‌ణంగానే స‌ముద్ర గ‌ర్భంలో ఎన్నో ర‌కాల జీవులున్నాయి. అందులో మ‌న‌కు తెలిసిన‌వి కొన్ని మాత్ర‌మే. ఇక ఎప్పుడైనా స‌ముద్ర‌గ‌ర్భంలో ఏవైనా కొత్త జీవులు క‌నిపించాయంటే చాలు అందుకు సంబంధించిన ఫోటోల‌ను వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం ఆ కొత్త ర‌క‌మైన జీవుల గురించి ప‌రిశోధ‌న‌లు చేస్తుంటారు. వింత ఆకారంలో ఉన్న జీవులు ఏదైనా బ‌య‌ట ప‌డితే అవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంటాయి.

Advertisement

ఈ త‌రుణంలోనే ఇలాంటివి చూసిన త‌రువాత స‌ముద్ర గ‌ర్భం అంతు చిక్క‌ని జీవ‌రాశుల‌కు నిల‌యంగా మారింది. విశాఖ‌ప‌ట్ట‌ణం స‌ముద్ర తీర ప్రాంతంలో ఒక అరుదైన జీవి ఇటీవ‌ల క‌నిపించింది. శాస్త్రవేత్త‌లు ఈ వింత అయిన జీవిని క‌నుగొన్నారు. ఈ వింత జీవిని చూసి ప్ర‌తీ ఒక్క‌రూ షాక‌వుతున్నారు. ఇక ఈ వింత జీవి పేరు ప్లాట్ వార్మ్. భార‌త‌దేశం తూర్పు తీరంలో ఉండే ఈ జీవి విశాఖ‌లో తొలిసారిగా క‌నిపించింద‌ని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక దీని ఆకారం చూస్తే మాత్రం చెట్టు మీది నుంచి రాలిన ఓ ఆకులా ఉంటుంది ఇది. అందుకే ఇది జీవి అనే అనుమానం కూడా ఎవ్వ‌రికీ రావ‌డం లేదు.

Advertisement


ర‌క్త‌నాలాలు లేని ఈ జీవి లేత ముదురు నీలం రంగులో మ‌ధ్య‌లో పొడ‌వుగా ప‌సుపు రంగు వెన్నుతో ఆంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. స‌ముద్ర‌తీరంలో ఆటుపోట్లు సంభ‌వించిన స‌మ‌యంలో ఇలాంటి జీవులు క‌నిపించ‌డం జ‌ర‌గ‌డం కామ‌న్‌. గ‌త కొంత కాలం నుంచి కూడా ఈస్ట్ కోస్ట్ క‌న్జ‌ర్వేష‌న్ టీమ్ ఆంధ‌ప్ర‌దేశ్ తీరంలో రెండు వారాల‌కు ఒక‌సారి మైరాన్ వాక్ చేప‌డుతున్నారు. ఆస‌క్తి ఉన్న వారు ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు. ఇటీలే ఈ వాక్ చేప‌డుతున్న స‌మ‌యంలోనే 3 సెం.మీ. పొడువు క‌లిగి ఫ్లాట్ వార్మ్ అనే వింత జీవిని క‌నుగొన్నారు. ఈ జీవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈసీసీటీ, గ్రీన్ పా సంస్థ‌ల‌కు చెందిన మెరైన్ బ‌యాల‌జిస్టులు ఇంట‌ర్ టైడ‌ల్ బ‌యోడైవ‌ర్సిటీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ రుషికొండ బీచ్ లో గ‌త ఏడాది జులైలో వాక్ చేస్తున్న స‌మ‌యంలో 3 సెం.మీ పొడ‌వు ఉన్న మెరైన్ ఫ్లాట్ వార్మ్ క‌నిపించింది. అరుదైన జీవి క‌నిపించిన‌ప్పుడు దాని గురించి సైంటిఫిక్ జ‌ర్న‌ల్ లో ప్ర‌చురించాల్సి ఉంటుంది. ఫ్లాట్ వార్మ్ ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్ ఆఫ్ క్రియేటివి రీసెర్చ్ థాట్ కి పంపించ‌గా జులై మొద‌టి వారంలోనే దీనిని ప్ర‌చురించ‌డం విశేషం.

Also Read : 

భార‌త‌దేశంలో ఉన్న‌టువంటి అత్యంత చివ‌రి గ్రామం ఏదో మీకు తెలుసా..?

నేను ఈరోజుకి తెలుగు చదవలేను అంటున్న మంచు లక్ష్మి పై నెటిజన్ల సెటైర్లు..!!

Visitors Are Also Reading