Home » నేను ఈరోజుకి తెలుగు చదవలేను అంటున్న మంచు లక్ష్మి పై నెటిజన్ల సెటైర్లు..!!

నేను ఈరోజుకి తెలుగు చదవలేను అంటున్న మంచు లక్ష్మి పై నెటిజన్ల సెటైర్లు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు.. అయితే వారంతా తెలుగు రాష్ట్రాల వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు.. వారు తెలుగు మాట్లాడలేదు అంటే దానికి అర్థం ఉంది.. కానీ తెలుగు రాష్ట్రానికి చెందిన మంచు లక్ష్మి మాత్రం తెలుగు రాదని చెప్పడం పై సోషల్ మీడియాలో చాలామంది తెలుగు నెటిజన్స్ వివిధ రకాల కామెంట్లతో మంచు లక్ష్మి ని ట్రోల్ చేస్తున్నారు.. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ లక్ష్మీ ఏమంది అంటే..

Advertisement

తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆమె మాట్లాడే భాషకు మాత్రం సపరేట్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అమెరికన్ యాసేంట్ తెలుగులో మాట్లాడుతుంది. ఆమె అలా మాట్లాడడం కొంతమందికి నచ్చుతుంది మరికొందరికి నచ్చదు. అయితే ఆమె ఇంటర్వ్యూలో తన భాష పై తానే ఒక సెటైర్ వేసుకుంది. నేను పెరిగిన వాతావరణం వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అంటూ చెప్పుకొచ్చింది. ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసిన వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తానని అంటోంది మంచు లక్ష్మి. అయితే మీరు మూవీస్ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మి ఇలా అన్నారు.

Advertisement

నేను సినిమాలు ప్రొడ్యూస్ చేయకూడదు అనుకున్నాను. వెబ్ సిరీస్ మాత్రమే చేయాలని భావించాను. ఎందుకంటే అందులో ఎంజాయ్ ఉంటుంది. నాకు నచ్చినప్పుడు నేను చేయవచ్చు లిమిట్స్ ఏమీ ఉండవు, నా డేట్స్ నేను ఫిక్స్ చేసుకోవచ్చు, మా పాపను కూడా చాలా బాగా చూసుకో వచ్చు సమయం దొరుకుతుందని అన్నారు. అందుకే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నానని, పాప పెరిగిన తర్వాత మళ్లీ సినిమాల బాట పడతానని తెలియజేశారు మంచు లక్ష్మి.

ALSO READ;

హీరోయిన్ల విషయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మరీ ఇలా ఉండేవారా..?

అభిషేక్ తో డేటింగ్ టైంలో ఐశ్వర్య ఏ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా ?

 

Visitors Are Also Reading