ప్రపంచంలో మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ప్రపంచం గురించి అలా పక్కకు పెడితే మన భారతదేశంలో కూడా అంతు చిక్కని రహస్యాలు, కొన్ని ప్రదేశాలు, కొన్ని కోటలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక అలాంటి ప్రదేశాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉంటుంది. భారతదేశంలో కొన్ని లక్షల గ్రామాలున్నాయి. అయితే భారత్‌లో ఉన్నటువంటి చివరి గ్రామం ఏది..? అది ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతదేశంలోని చివరి గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. ఆ గ్రామం పేరు మనా. ఇక ఈ గ్రామాన్ని మనం ఎప్పుడైనా సందర్శించవచ్చు. బద్రినాథ్ స్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ఆ గ్రామానికి వెళ్లవచ్చు. బద్రినాథ్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఆ గ్రామం ఉంటుంది. దీనినే భారతదేశంలో చివరి గ్రామమని పిలుస్తుంటారు. ఇక ఆ గ్రామంతో మహాభారతానికి సైతం సంబంధం ఉందని పెద్దలు చెబుతుంటారు. ఈ గ్రామంలో కేవలం 60 ఇండ్లు మాత్రమే ఉంటాయట. దాదాపు 400 మంది జనాభా కలరు. ఇక్కడ చాలా ఇండ్లు చెక్కతో చేసినవే దర్శనమిస్తుంటాయి. పై కప్పు రాతి పలకలతో ఉంటుంది.
Advertisement
Advertisement
ఈ ఇండ్లు భూకంపాలను సైతం తట్టుకుంటాయట. ఇక ఆ గ్రామంలో ఆరోగ్యానికి మేలు చేసే పలు ఆయుర్వేద మూలికలు ఎన్నో లభిస్తాయట. వీటితో పాటు గణేష్ గుహ, వ్యాస గుహ ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. ఇక్కడ ఉన్న వ్యాస గుహలోనే మహాభారత రచన జరిగిందని పేర్కొంటారు. మనా గ్రామం నుంచే పాండవులు స్వర్గానికి వెళ్లారని పలు గ్రంథాలు వెల్లడించాయి. ఇక పాండవులు స్వర్గానికి వెళ్లేందుకు ఈ గ్రామాన్ని చేరుకున్నప్పుడు ఇక్కడ ప్రవహించే సరస్వతి నది గుండా ఓ మార్గమును కనుగొన్నారు. ఆ మార్గంలో అవాంతరాలు ఏర్పడడంతో భీముడు రెండు పెద్ద రాళ్లను తీసుకొచ్చి నదికి అడ్డంగా వేసి వంతెన నిర్మించాడట. ఇక ఈ వంతెన మీదుగా వారు స్వర్గానికి వెళ్లారట. నేటికీ కూడా సరస్వతి నది ఆ ప్రదేశం గుండా ప్రవహిస్తూ అలకనందలో కలుస్తుంది. ఇప్పటికీ భీముడు నిర్మించిన ఆ రాతి వంతెన అలాగే ఉంది. ఈ వంతెనను ఇప్పుడు భీంపుల్ అని పిలుస్తున్నారు.
Also Read :
శ్రీదేవి ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి అడ్డుపడటానికి కారణం..?
ఫోటోలో ఉంది త్రిష అనుకుంటే పప్పులో కాలేసినట్టే…అచ్చం త్రిషలానే ఉన్న ఆ అమ్మాయి ఎవరంటే..?