Home » ఫోటోలో ఉంది త్రిష అనుకుంటే ప‌ప్పులో కాలేసినట్టే…అచ్చం త్రిష‌లానే ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే..?

ఫోటోలో ఉంది త్రిష అనుకుంటే ప‌ప్పులో కాలేసినట్టే…అచ్చం త్రిష‌లానే ఉన్న ఆ అమ్మాయి ఎవ‌రంటే..?

by AJAY
Ad

ప్ర‌పంచంలో మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురు ఉంటార‌ని చెబుతుంటారు. కొన్ని సార్లు మ‌న‌కు కూడా ఒక‌రిని పోలిన వ్య‌క్తులు మ‌రొక‌రు క‌నిపిస్తుంటారు. ముఖ్యంగా సినిమా హీరోల‌లా హీరోయిన్ ల‌లా రాజ‌కీయ‌నాల‌కుల మాదిరిగా ఉన్న సెల‌బ్రెటీలు ఎక్కువ వెలుగులోకి వ‌స్తుంటారు. స‌మంతను పోలిన అష్షు రెడ్డి సోష‌ల్ మీడియాలో వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు అష్షు కూడా సెల‌బ్రెటీ అయిపోయింది.

Advertisement

అచ్చం చంద్ర‌బాబు లా ఉండే ఓ వ్య‌క్తి హోట‌ల్ లో ప‌నిచేస్తున్న వీడియో వైర‌ల్ కాగా అత‌డికి ఆర్జీవీ పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చాడు. అంతే కాకుండా చ‌నిపోయిన సౌందర్య రూపురేక‌ల‌తో క‌నిపించే ఓ యువ‌తి సోష‌ల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉంటారు. ఆమెను చూసిన వారంద‌రూ అచ్చం సౌంద‌ర్య లాగేనే ఉన్నారంటూ కామెంట్స్ పెడుతుంటారు. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు అచ్చం హీరోయిన్ త్రిష మాదిరిగా క‌నిపిస్తున్న ఓ అమ్మాయి ఫోటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఆ యువ‌తి పేరు దీపికా విజ‌య్ కాగా అచ్చం త్రిష లానే ఉండ‌టంతో నెటిజన్లు ఆశ్చ‌ర్యపోతున్నారు. మైసూర్ కు చెందిన‌న దీపిక విజయ్ సోష‌ల్ మీడియాలో రీల్స్ మ‌రియు ఫోటోలు పోస్ట్ చేస్తుండ‌టంతో ఫాలోవ‌ర్స్ అంద‌రూ మీరు త్రిష‌లానే ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. అంతే కాకుండా మ‌రికొంద‌రు కొంప‌తీసి మీరు త్రిష చెల్లెలా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక త్రిష రూపురేక‌ల‌తో ఉన్న దిపికా కు కూడా ల‌క్ష‌ల్లో ఉన్నారు. త్రిష లా ఉండ‌ట‌మే కాకుండా దిపిక త్రిష‌లా న‌టిస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

Visitors Are Also Reading