సాధారణంగా రాక్ పేయింటింగ్ అనేది ఒక అద్భుతమైన కళ. మామూలుగా 100 సంవత్సరాలు, రెండు వందలు మా అంటే వెయ్యేళ్ల కిందటి పేయింటింగ్ అప్పుడప్పుడు దర్శనం ఇస్తుండడం అందరం చూస్తున్నాం. కానీ అక్కడ దాదాపు 10వేల ఏళ్ల నాటి పేయింటింగ్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అది ఎక్కడో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో 10వేల ఏళ్ల నాటి రాతి చిత్రాలను ఏపీ పురావస్తు శాక కనుగొన్నది. గతంలో కర్నూలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కనిపించాయట. డిపార్ట్‌మెంట్ కమిషనర్ వాణి మోహన్, ఏపీ పురాతన చారిత్రక భవనాలు, పురావస్తు అవశేషాల చట్టం, 1960 ప్రకారం.. వాటి రక్షణ కోసం చర్యలు తీసుకుంటారు. ఇక పురావస్తు శాఖ సంచాలకులు వెంకటరావు వీటి గురించి వివరించారు. శ్రీకాకుళం పట్టణానికి 44 కిలోమీటర్లు, వైజాగ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందిగాంలోని కొండ తెంబూరు గ్రామంలో అన్వేషణ నిర్వహించాం. కొండల గొలుసుకు తూర్పున, పేయింటింగ్ లను కనుగొంది. క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే పేయింటింగ్‌లో నెమలి, పంది, ఖడ్గమృగం, కోతి, మానవుడు, ఏనుగు, పిల్ల ఏనుగు, కుందేలు వంటి జంతువులు, పక్షులు కనిపిస్తున్నాయి.
Advertisement
ఇక ఈ పేయింటింగ్ ని అక్కడ ఎర్రని ఓచర్‌తో గీశారు. నెమలిని అందంగా చిత్రీకరించడంతో రాక్ షెల్టర్ల ముందు రాక్ బెడ్ లో చిన్న పగుళ్లు కుప్పల్లో క్వార్ట్‌జైట్ రాయి నాడ్యూల్స్ భాగాలు కనుగొనబడ్డాయి. బ్లేడ్ కోర్ కూడా దొరికిందని వెల్లడించారు. పేయింటింగ్స్ కళాఖండాలు చాలా శతాబ్దాల కింద ఈ ప్రాంతంలో మానవ ఉనికిని నిర్థారించాయని చెప్పారు. ఇంతకుముందు దిమ్మిడి జ్వాలా వద్ద తేనేకొండ వద్ద ఇలాంటి పేయింటింగ్‌లను చూసింది. బల్లి, జింక, రాక్ షెల్టర్ ఫ్లోర్ ముందు వివిధ సైజుల్లో నాలుగు కప్పుల గుర్తులు కనుగొనబడ్డాయి. ఇవి ప్రదర్శిస్తాయని నమ్ముతారు. చనిపోయే వారికి ఆచారాలు అని చెప్పారు. ఇక జోగుల మెట్ట వద్ద ఉన్న ఆధారాలు చివరి ఎగువ ప్రాచీన శిలాయుగంకు చెందిన (15000 నుంచి 10000) సంస్కృతులకు కావచ్చని వెంకటరావు అభిప్రాయపడ్డారు.
Also Read :
శ్రీకృష్ణుడి మరణ రహస్యం గురించి మీకు తెలుసా..?