టెలికాం దిగ్గజం అయినటువంటి ఎయిర్‌టెల్ మరోమారు వినియోగదారులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్‌టెల్ తన రీచార్జ్ ప్లాన్‌లను పెంచిన విషయం తెలిసినదే. అయితే ఇప్పుడు మరొకసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచడానికి కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది.
ఇక 2022లోనే చార్జీలను పెంచుతున్నట్టు స్పష్టం చేసారు. మార్చి చివరి వరకు సగటున ఎయిర్‌టెల్‌కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెల రూ.178 ఆదాయం వచ్చిందని చెప్పిన గోపాల్ విట్టల్ దీనిని రూ.200కు తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ప్రీఫెయిడ్ టారిఫ్‌లు చాలా తక్కువ ధరల వద్దనే ఉన్నాయని.. తొలుత 200 వద్దకు అయినా తీసుకెళ్లాల్సి ఉందని చెప్పారు.
Advertisement
Advertisement
కనీసం 10 శాతానికి పైగా, 20 శాతం వరకు ధరలను పెంచే అవకాశముందని సమాచారం. 2021 నవంబర్‌లో ముందుగా టారిఫ్‌లను పెంచుతున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించగా.. వొడాఫోన్, ఐడియా, జియో కూడా ధరలను పెంచేసాయి. ఇప్పుడు కూడా చార్జీల పెంపును తొలుత ఎయిర్‌టెల్ అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంలో ఒక్కొక్క యూజర్ నుండి సగటు ఆదాయాన్ని రూ.300ల నుంచి రూ.400 వరకు తీసుకెళ్లాలన్నది ఎయిర్‌టెల్ వ్యూహం. దీనిని ఆ సంస్థ అధినేత సునీల్ మిట్టల్ ఏడాది క్రితమే ప్రకటించారు.
Also Read :
నూతన ఫీచర్‌తో యూట్యూబ్.. మీకు నచ్చిన సీన్ వీడియోలో ఎక్కడుందో ఇలా చూడవచ్చు..!
చికెన్, మటన్ ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్ రాకూడదంటే ఈ ఆకు తప్పకుండా తినాల్సిందే..!