కొంత మందికి నాన్ వెజ్ పేరు చెప్పగానే ఊపు వస్తుంటుంది. ముక్క లేనిదే ముద్ద దిగదంటారు. కొంత మందికి రోజూ సుక్క, ముక్క తప్పకుండా ఉండాల్సిందే. కొంత మంది మాత్రం చికెన్, మటన్ నిత్యం తినే వారి శరీరంలో హోమోసిస్టీన్ అనేది బాగా పెరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. నిత్యం చికెన్, మటన్ తినడం వల్ల శరీరంలో కొవ్వు పరిమాణం ఎక్కువవుతుంది. ఎమైనో యాసిడ్, హోమోసిస్టిన్ విపరీతంగా పెరిగిపోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శరీరంలో ఎక్కువగా పెరిగే హోమోసిస్టీన్ తగ్గించకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. క్రమంగా జీర్ణక్రియ దెబ్బ తింటుంది. నాన్ వెజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.గ్యాప్ ఇవ్వకుండా అలా తింటూ పోతే జీర్ణక్రియ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఆ సమస్యల నుండి బయటపడేందుకు ఈ ఆకులతో చేసిన కూర చక్కగా పని చేస్తుంది. ఇక బచ్చలకూర చాలా మందికి తెలిసే ఉంటుంది. అతికొద్ది మంది మాత్రమే బచ్చలకూరను ఇష్టంగా తింటారు. మరికొందరూ బచ్చలకూర పేరు వినగానే పారిపోతారు. ఈ బచ్చల కూర సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. ఇలా చౌక కూడా. వీటిలో ఉండే 104 మైక్రోగ్రామ్స్ ఫోలేట్ అనేది ఈ హోమోసిస్టిన్ ను అడ్డుకుని ప్రోటీన్గా మార్చుతుంది. ప్రోటీన్గా మార్చి శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఇతర దేశాల వారు నాన్ వెజ్‌ను రెండు పూటలు తింటారు. వారికి ఈ సమస్య తక్కువగానే ఉంటుంది.
ముఖ్యంగా వారు ఆహారంలో సలాడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఆకుకూరలను స్టీమ్ చేసి శాండ్విచ్ లో వాటిలో ఎక్కువగా వాడుతారు. ఆకుకూరలతో తయారు చేసే జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోవడం ద్వారా నేచురల్ డైట్ ఎక్కువగా వాడడం వల్ల నాన్ వెజ్ల సైడ్ ఎఫెక్ట్ నుంచి వాళ్లు తప్పించుకుంటారు. ఇక భారతదేశంలో ఆకుకూరలు, పండ్లను చాలా తక్కువగా తీసుకుంటారు. భారతీయులు ఆరోగ్యం కన్నా రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా పండ్లను తీసుకోవడం చాలా తక్కువ. ఫ్రూట్ జ్యూస్‌లు, సలాడ్స్ కొనేందుకు తయారు చేసుకునేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక బచ్చల కూర అయితే తక్కువ ధరలోనే వస్తుంది. ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది. ఇంకెందుకు ఆలస్యం నాన్ వెజ్ ఎక్కువగా తింటే బచ్చలకూరను తప్పక తీసుకోండి.
Also Read :
1985 నంద్యాల సభలో సూపర్ స్టార్ కృష సభ జరిగితే ఆయన పై ఎందుకు చెప్పులు, రాళ్ల దాడి జరిగింది..?
నూతన ఫీచర్‌తో యూట్యూబ్.. మీకు నచ్చిన సీన్ వీడియోలో ఎక్కడుందో ఇలా చూడవచ్చు..!