Home » పంతం నీదా నాదా అంటూ.. సూపర్ స్టార్- మెగాస్టార్ మధ్య పోటీ.. ఏం జరిగిందంటే..??

పంతం నీదా నాదా అంటూ.. సూపర్ స్టార్- మెగాస్టార్ మధ్య పోటీ.. ఏం జరిగిందంటే..??

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకరు సూపర్ స్టార్..మరొకరు మెగాస్టార్..వీరిద్దరూ ఎంతో కష్టపడి స్వయంకృషితో ఎంతో పైకి వచ్చి సినిమారంగాన్ని ఏలే సత్తా దక్కించుకున్న స్టార్ హీరోలే.అలాంటి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..రజనీకాంత్ చిరంజీవి మధ్య మొదటి క్లాష్ 1979లో వచ్చింది. ఇందులో ముందుగా చిరంజీవి సినిమా తయారమ్మ బంగారయ్య జనవరి 12 న వస్తే, ఆ తర్వాత జనవరి 25న రజనీకాంత్ నటించిన ఇద్దరు అసాధ్యులే సినిమాతో రావడం జరిగింది. చిరంజీవి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బాగా రాణించి ఎబో యావరేజ్ గా నిలిచింది. రజనీకాంత్ సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. ఇక రెండోసారి 1979లో సెప్టెంబర్ 5న టైగర్ సినిమా తో రజినీకాంత్ వస్తే, సెప్టెంబర్ 15న కోతలరాయుడు చిరంజీవి సినిమా వచ్చింది. టైగర్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. చిరంజీవి కోతల రాయుడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎబో
యావరేజ్ గా నిలిచింది. ఇక మూడో క్లాష్ 1980 లో వచ్చింది. మోసగాడు సినిమా తో చిరంజీవి మే 22న రాగా, మే 31న రజినీకాంత్ రామ్ రాబర్ట్ రహీమ్ సినిమా తో వచ్చాడు. చిరంజీవి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుంది. రజినీకాంత్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. నాలుగోసారి 1991లో మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది. అక్టోబర్ 18న చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమా వచ్చింది. అలాగే నవంబర్ 5న రజనీకాంత్ నటించిన దళపతి సినిమా వచ్చింది. చిరంజీవి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. రజినీకాంత్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.ఇక తక్కువ నిడివి పాత్రలో రజినీకాంత్ నటించిన పెద్ద రాయుడు సినిమాకు పోటీగా వచ్చినా చిరంజీవి బిగ్ బాస్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక రజనీకాంత్ నరసింహ సినిమాకి కూడా చిరు పోటీ ఇవ్వడానికి వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసింది.దీనికి పోటీగా వచ్చిన ఇద్దరు మిత్రులు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి ఇంద్ర సినిమా తో జులై 24,2002లో వస్తే, దానికి రజనీకాంత్ బాబా సినిమాతో ఆగస్టు 15న రావడం జరిగింది. ఇంద్ర సినిమా బాక్సాఫీస్ రికార్డులను చెడుగుడు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.కానీ రజనీకాంత్ నటించిన బాబా సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది.

Advertisement

ALSO READ;

Advertisement

రికార్డులతో బాలీవుడ్ కి చమటలు పట్టించిన బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా “సమర సింహ రెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా ?

“గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా….ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

 

Visitors Are Also Reading