Home » “గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా….ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

“గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా….ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

by AJAY
Ad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన సినిమా గంగోత్రి. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు 100 వ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అల్లు అరవింద్, అశ్వినీదత్ గంగోత్రి సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

Advertisement

ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు అల్లుఅర్జున్ నటనకు ప్రశంసలు కురిసాయి. కీరవాణి అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక ఈ సినిమాలో కావ్య అనే చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. వల్లంకి పిట్ట పాటలో కావ్య తన క్యూట్ లుక్ తో ఆకట్టుకుంటుంది. లంగా జాకెట్ వేసుకుని ముద్దు ముద్దు కనిపిస్తూ మెప్పించింది.

ఆ తర్వాత కావ్య చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. గంగోత్రి సినిమాలో నటించినప్పుడు కావ్య వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే కాగా 2003 లో గంగోత్రి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కావ్య వయసు 19 ఏళ్ళు కాగా త్వరలోనే కావ్య హీరోయిన్ గా పరిచయం అవుతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు లా చదువుతోంది. ఇప్పటికే కావ్య మోడలింగ్ లోకి కూడా అడుగుపెట్టింది. అంతేకాకుండా చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. దాంతో కావ్య హీరోయిన్ సక్సెస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.

Advertisement

ఇప్పటికే సోషల్ మీడియాలో తన ఫోటోలతో కుర్రాళ్ళ మతి పోగొడుతుంది. ఇన్స్టాగ్రామ్ లో కావ్య కు 30 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫిట్నెస్ వీడియోలు, డాన్స్ వీడియోలతోను ఆకట్టుకుంటోంది. ఇక కొద్ది రోజుల క్రితం కూడా కావ్య తాను హీరోయిన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది. తనకు తెలుగు భాష స్పష్టంగా వస్తుంది కాబట్టి నటనలో కూడా అది ఉపయోగపడుతుందని చెప్పింది. మరి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే కావ్య సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Also read :

భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించకుంటే వచ్చే సమస్యల గురించి తెలుసా ?

రికార్డులతో బాలీవుడ్ కి చమటలు పట్టించిన బాలయ్య బాబు ఫ్యాక్షన్ సినిమా “సమర సింహ రెడ్డి” గురించి ఈ విషయాలు తెలుసా ?

 

 

Visitors Are Also Reading