Home » ఈ నెలలో పుట్టినవారు ప్రేమలో విఫలం అవుతారు.. వ్యక్తిగతంగా విజయవంతం అవుతారు..!!

ఈ నెలలో పుట్టినవారు ప్రేమలో విఫలం అవుతారు.. వ్యక్తిగతంగా విజయవంతం అవుతారు..!!

by Sravanthi
Ad

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని విషయాలు తప్పనిసరిగా నమ్మాలి.. జ్యోతిష్య నిపుణులు చెప్పినవి కూడా మన జీవితంలో జరిగిపోతుంటాయి.. అయితే మే నెలలో పుట్టినవారు వారి జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.. అనేది ఓ సారి చూద్దాం..!! మే నెలలో పుట్టిన వారికి మిథునం, వృషభం అనే రెండు రాశులు ఉంటాయి. వీరికి త్యాగం చేసే అలవాటు ఎక్కువగా ఉంటుంది.. వారికి సంబంధించిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరికి ప్రయాణాలపై ఎక్కువగా ప్రేమ ఉంటుంది.. కొత్త కొత్త ప్రదేశాలు తిరగాలని కోరిక ఉంటుంది.. అలాగే పార్టీలంటే వీరికి చాలా సరదాగా ఉంటుంది..

Advertisement

ఎక్కువగా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. చాలా ఓపికతో ఉదార బుద్ధి కలిగిన వారు. అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఎదుగుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వీరు ఆహారానికి కూడా మంచి ప్రాముఖ్యత ఇస్తారు.. అంతే కాకుండా మంచి మంచి వంటలు కూడా వారే వండుకొని ఆస్వాదిస్తారు. ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా కళాకారులు అవుతారు.. ఇందులో పుట్టినవారికి శృంగార వాంఛ కూడా ఎక్కువగా ఉంటుంది. న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉంటారు.. అందుకే వీరిని చాలా విషయాల్లో విజయం కన్నా అపజయమే ఎక్కువగా పలకరిస్తుంది.. అయినా నిరాశ చెందకుండా ధర్మబద్ధంగా పోరాడాలని తపన వీరికి ఉంటుంది.

Advertisement

ఈ నెలలో పుట్టిన 70 శాతం మందికి చిన్న వయసులోనే పెళ్లి అవుతుంది. ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమలో విఫలం అవుతారు కానీ ఉద్యోగ, వ్యాపార,రాజకీయ రంగాల్లో విజయవంతం అవుతారు. మంచి గౌరవం మర్యాద సంపాదించుకుంటారు. వీరు చాలా తెలివిగా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. మే నెలలో పుట్టిన వారికి ఎక్కువగా రక్తపోటు కిడ్నీ వంటి వ్యాధులు రావచ్చు.
ఆర్థికంగా ధనం బాగా సంపాదిస్తారు.. దాంతో సుఖపడతారు కూడా.. వీరికి శుక్రవారం, మంగళవారం కలిసొచ్చే రోజులు.. నీలం గులాబీ రంగు కలిసొచ్చే రంగులు..

also read;

ప్రైవేట్ వీడియోలు బ‌య‌ట‌పెడ‌తాన‌న‌డంతో.. ప్రియుడిని మ‌ట్టుపెట్టించిన ప్రియురాలు..!

ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని దైవ ప్రసాదాల్లో ఎందుకు ఉపయోగించరో తెలుసా..!!

 

Visitors Are Also Reading