Home » ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని దైవ ప్రసాదాల్లో ఎందుకు ఉపయోగించరో తెలుసా..!!

ఉల్లిపాయల్ని, వెల్లుల్లిని దైవ ప్రసాదాల్లో ఎందుకు ఉపయోగించరో తెలుసా..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

భారతదేశంలో ఎక్కువగా దేవుళ్లను నమ్ముతుంటారు..ప్రతిరోజు ఏదో ఒక దేవుడు స్పెషల్ గా ఉంటాడు. అయితే భారతదేశంలో ఎన్నో దేవుళ్ళు దేవత గుళ్ళు ఉన్నాయి. మనం గుళ్లో కి వెళ్ళి నప్పుడు రక రకాల ప్రసాదాలు కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటాం. అయితే వారంలో మనం ఒక్కో రోజు ఒక్కో దేవున్ని ఎలా పూజిస్తామో ఆ విధంగానే నైవేద్యాలు కూడా మారుస్తూ ఉంటాం. మరి ఏ దేవునికైనా లేకుంటే దేవత కైనా పూజ చేసినప్పుడు ఎలాంటి నైవేద్యం పెట్టాలో తెలుసా.. శ్రీరాముని కైతే పానకం వడపప్పు నైవేద్యంగా పెడతారు. అలాగే శివుడినీ సోమవారం రోజున భక్తులు పూజిస్తారు. కోరిన కోర్కెలు తీరుస్తూ ఉండే బోలా శంకరుడుగా శివున్ని ప్రార్థిస్తూ ఉంటారు భక్తులు.

Advertisement

 

ఈయనకు దద్దోజనం అంటే చాలా ఇష్టం. ఆ వంటకాన్ని నైవేద్యంగా పెట్టి పూజిస్తే మనకు సకల సౌకర్యాలు లభిస్తాయి. అయ్యప్ప ప్రతి ఏటా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి మాల తీయడానికి శబరిమల వెళుతుంటారు. ఈయనకు పేలాలు అంటే చాలా ఇష్టం. శ్రీకృష్ణుడు ఈయనకు ఏ ఆహారం అంటే ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే ఆయనను భక్తులు వెన్నదొంగ అని పిలుస్తారు. అందుకే శ్రీ కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెడతారు. మరి ఈ ప్రసాదాల తయారీలో ఎందుకని వెల్లుల్లిని ఉపయోగించరు..

Advertisement

దాని ప్రధాన కారణం ఏంటో ఓసారి చూడండి. ఆయుర్వేదం ప్రకారం చూస్తే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవి సాత్విక, రాజసిక, తామసిక. వీటిలో పదార్థాలు మనిషిలోని తప్పు గుణాన్ని పెంచడమే తగ్గించడమో చేస్తాయి. ఉల్లిపాయ వెల్లుల్లి ఇంకా కొన్ని మొక్కలు రాజసిక క్యాటగిరికి చెందినది. వీటిని తీసుకోవడం వల్ల అజ్ఞానం అభిరుచి ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్ఠతో ఉండాలనుకునే వారిని ఇవి డైవర్ట్ చేస్తాయి కాబట్టి దైవ ప్రసాదం లో వీటిని నిషేధించారట.

also read;

ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలు విడుద‌లైన హీరోలు వీరే..!

గోత్రం అంటే ఏమిటి..దీని వెనక ఇంత సైన్స్ దాగి ఉందా..!!

Visitors Are Also Reading