ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీ, పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. ఇక తమ దృష్టి అంతా కర్నాటకవైపు ఉంచుతాం ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బెంగళూరులో పర్యటించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రావణుడిని అహంకారం మాదిరిగా కేంద్రానికి కూడా అహంకారం ఉన్నదని విమర్శించారు. సాగు చట్టాలను తీసుకొచ్చారు అని విమర్శించారు. రైతులతో చెలగాటం వద్దని బీజేపీని తాము పదే పదే హెచ్చరించినా పెడచెవిన పెట్టిందన్నారు.
Advertisement
చివరికి సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని.. ప్రజలకు పాఠశాలలు, ఆసుపత్రులు, ఉచిత విద్యుత్, ఉచిత రవాణా, ఉచిత నీరు కావాలంటే వారు ఆప్ కు ఓటు వేయాలని బెంగళూరులో జరిగిన రైతు ర్యాలీలో పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా చట్టం చేయాలని డిమాండ్ చేసినప్పుడు మేము సామాన్య ప్రజలు రాజకీయాల్లోకి రావాలని సవాలు చేశాం. కర్నాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ వసూలు చేసిన విషయాన్ని కేజ్రీవాల్ ప్రస్తావించారు.
Advertisement
ఢిల్లీలో 0 శాతం కమీషన్ ప్రభుత్వం ఉంది. నిజాయితీ ప్రభుత్వం అని, ఒక్క పైసా కూడా లంచంగా తీసుకోదని కేజ్రీవాల్ చెప్పారు. నిజాయితీ గల ప్రభుత్వం అని ప్రధాని నరేంద్ర మోడీతోనే సర్టిఫికెట్ పొందామని.. తనపై డిప్యూటీ మనీష్ సిసోడియాతో పాటు 17 మంది ఎమ్మెల్యేలు, సీబీఐ, ఆదాయపు పన్ను, ఢిల్లీ పోలసులు దాడులు నిర్వహించారనిఅయినా ఎక్కడ ఏమి గుర్తించలేదని గుర్తు చేశారు.
Also Read :
పిల్లల ఫుడ్ విషయంలో పెద్దలు చేసే తప్పులు ఇవే..!
బాలయ్యకు జోడిగా మంజుల నటిస్తే ఆత్మహత్య చేసుకుంటామన్నారు….అప్పట్లో సంచలనం సృష్టించిన వార్త….!