Telugu News » బాలయ్య బాబుతో, నటి మంజుల నటించాల్సి ఉండగా ఎందుకు చివరికి క్యాన్సల్ అయ్యింది ?

బాలయ్య బాబుతో, నటి మంజుల నటించాల్సి ఉండగా ఎందుకు చివరికి క్యాన్సల్ అయ్యింది ?

by AJAY MADDIBOINA
Published: Last Updated on

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేయడం సాధారణమే.అయితే స్టార్ హీరోల కుమారుల కంటే కుమార్తెలు తక్కువగా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా హీరోల కుమారులు హీరోలుగా నిలదొక్కుకున్నారు కానీ హీరోల కుమార్తెలు ఇండస్ట్రీలో రాణించిన సందర్భాలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ వారసులు అందరూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కుమారుడైన రమేష్ బాబు బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. కానీ సక్సెస్ అందుకోక పోవడంతో వెనుదిరిగాడు.

Ads

 

ఇక కృష్ణ చిన్న కుమారుడు మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడు అనే విధంగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మహేష్ బాబు కూడా బాలనటుడిగా పరిచయమై ఆ తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఇదిలా ఉంటే కృష్ణ ముద్దుల కుమార్తె మంజుల కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి మంజుల తన మొదటి సినిమా బాలకృష్ణ తో చేయాల్సింది. మంజుల మొదట తనకు హీరోయిన్ అవ్వాలని ఉందని కృష్ణకు తెలిపింది.

దాంతో కృష్ణ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డికి ఈ విషయం చెప్పారు. ఎస్.వి.కృష్ణారెడ్డి అప్పట్లో బాలయ్యతో టాప్ హీరో అనే సినిమా చేయాలనుకున్నారు. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా మంజులను అనుకున్నారు. ఈ విషయం బాలయ్యకు కూడా చెప్పగా ఆయన కూడా ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. దాంతో కృష్ణ అభిమానులు కొందరు ఆయన ఇంటికి వెళ్లారు. మంజుల ఇతర హీరోలతో ఆడి పాడటం తమకు ఇష్టం లేదని చెప్పారు. అదే గనుక జరిగితే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు.

దాంతో మంజుల టాప్ హీరో సినిమాలో నటించడం లేదని కృష్ణ వాళ్లకు చెప్పారు. అలా మంజుల బాలయ్య పక్కన నటించే అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఇక మంజుల స్థానంలో సౌందర్యను తీసుకున్నారు. మంజుల తెలుగులో సినిమాలు చేస్తే అభిమానులతో సమస్య వస్తుందని భావించి మలయాళంలో ఓ సినిమా లో హీరోయిన్ గా నటించడం ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో షో అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించకపోవడంతో నిర్మాతగా మారి పలు చిత్రాలను నిర్మించింది.

Also read :

ఎన్టీఆర్ ఎలివేషన్ సీన్ డిలీట్…జక్కన్న పై ఫ్యాన్స్ ఫైర్ …!

నాగార్జున అలా అన‌డంతో కృష్ణ ఫ్యాన్స్ కొట్ట‌డానికి వ‌చ్చార‌ట‌..అస‌లేం జ‌రిగిదంటే..!


You may also like