Home » ఈ నెలలో గర్భం దాలిస్తే ఇబ్బందులు తప్పవా.. వారు ఏమంటున్నారు..!!

ఈ నెలలో గర్భం దాలిస్తే ఇబ్బందులు తప్పవా.. వారు ఏమంటున్నారు..!!

by Sravanthi
Ad

ప్రతి ఒక్కరి జీవితంలో బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆనందదాయకమైన పరిణామం. కానీ ఇప్పటి జనరేషన్ లో చాలామంది జాబ్స్ ఇతర పనుల నిమిత్తం పిల్లల్ని కనాలంటే ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది అన్నీ ఆలోచించి ముఖ్యంగా ఆర్థికం, ఆరోగ్యం, శారీరకం ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పిల్లలను కంటున్నారు.. ఇన్ని నిబంధనలు పాటించినప్పుడు మరి ప్రెగ్నెన్సీ అనేది ఈ నెలలో రావాలి ఏ నెలలో రాకూడదో ఒకసారి చూడండి..!!

Advertisement

 

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రచురించినటువంటి జర్నల్ ప్రకారం చూస్తే.. మే నెలలో గర్భం దాల్చితే నెలలు నిండకుండానే ప్రసవించే ప్రమాదం ఉందట. వీరి అధ్యయనంలో 657,050 మంది తల్లులను వారికి పుట్టినటువంటి 1.4 మిలియన్ల మంది పిల్లలను పరిశీలించారు. ఆ శిశువు పుట్టిన తేదీ గర్భం దాల్చిన సమయంతో పోలిక చూశారు. మేలో గర్భందాల్చి.. జనవరి మరియు ఫిబ్రవరిలో నిండు గర్భంతో ఉన్న మహిళలు నెలలు నిండకుండానే ప్రచురించే అవకాశం

Advertisement

10% ఎక్కువగా ఉందని తెలియజేశారు. అలాగే జనవరి ఫిబ్రవరి నెలలో సాధారణంగా చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లూ జ్వరం లాంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. దీని కారణంగా కూడా నెలలు నిండకుండానే ప్రసవించే అవకాశాలుంటాయని..ప్రిన్స్ టన్ యూనివర్సిటీ రీసెర్చ్ అసోసియేట్ స్పష్టం చేసింది. నెలలు నిండకుండా జన్మించిన శిశువులు శ్వాస మరియు జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ స్పష్టం చేసింది.

నివారణ మార్గాలు: ఒకవేళ మే నెలలో ప్రెగ్నెన్సీ వస్తే ఫ్లూ వ్యాక్సిన్ గురించి వైద్యులతో మాట్లాడితే చాలా మంచిది. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను అసలు కలవకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్ తరచుగా చేతులు కడుక్కోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం ఆరోగ్యవంతంగా జరిగి ఆనందంగా జీవిస్తారని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్టీఆర్ నుండి పవన్ వరకు రెండు పెళ్లిల్లు చేసుకున్న తెలుగు నటులు ఎవరో తెలుసా ?

కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారన్న మురళీమోహన్.. ఆ సీన్ వల్లేనా..!!

 

Visitors Are Also Reading