Home » కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారన్న మురళీమోహన్.. ఆ సీన్ వల్లేనా..!!

కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారన్న మురళీమోహన్.. ఆ సీన్ వల్లేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మురళీమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా, నిర్మాతగా అనేక సంచలన విజయాలు సాధించి ఒక గొప్ప పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లో కూడా కీలకంగా ఉంటూ ఎంపీ గా కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. ప్రస్తుతం ఆయన ఇంటికి దూరమై ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు..

Advertisement

సినిమాల్లోకి ఎంట్రీ: జగమే మాయ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన మురళీమోహన్, దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చినటువంటి తిరుపతి అనే మూవీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలా మొదలైన ఆయన నటనా ప్రస్థానం దాదాపుగా 350 సినిమాల్లో నటించే లాగా చేసింది. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలోనే జయభేరి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టి ఆ బ్యానర్ లో చాలా చిత్రాలు నిర్మించారు. ఇందులో చాలా సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు అడుగులు వేసి చాలా సంపాదించారు.

రాజకీయం: పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన టిడిపి నుంచి పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈమధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృష్ణతో ఆయనకు ఉన్నటువంటి సంబంధం గురించి మరోసారి తెలియజేసారు. ఒక సందర్భంలో కృష్ణ ఫ్యాన్స్ నన్ను కొట్టడానికి వచ్చారని ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.

Advertisement

ఇంటర్ క్లాస్ మేట్స్ :కృష్ణ గారు నేను ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్ మనీ. కాలేజీ మొత్తంలో కృష్ణ అందగాడు. అందరూ ఆయన చుట్టూనే తిరిగే వారిని, కాలేజీ తర్వాత తేనె మనసులు సినిమాతో హీరోగా మారడం ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదగడం అందరికీ తెలిసిన విషయమే. నేను నటన నుంచి నిర్మాతగా మారాక కృష్ణ మరియు నాగార్జున కాంబినేషన్ లో వారసుడు అనే చిత్రాన్ని నిర్మించానని ఆ మూవీలో నాగార్జున తండ్రి కృష్ణను నిలదీసే సీన్ ఒకటి చెప్పారు.

కొట్టడానికి వచ్చారు: తండ్రీ కొడుకుల మధ్య వచ్చిన ఘర్షణ తారా స్థాయికి వెల్లే సీన్ లో కృష్ణ మరియు నాగార్జున నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వస్తారు. ఈ సీన్ చూసినటువంటి అభిమానులు మా ఇంటి మీదికి గొడవకు వచ్చారని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

నెక్‌డార్క్ ను పోగొట్టే అద్భుత‌మైన ఇంటి చిట్కా గురించి మీకు తెలుసా..?

అంగరంగ వైభవంగా జరగాల్సిన మహేష్ నమ్రతల పెళ్లి సింపుల్ గా జరగాడినికి కారణం ఏంటో తెలుసా…?

ఎన్టీఆర్ కొండ‌వీటి సింహంలో చిరును త‌ప్పించి మోహ‌న్ బాబుకు ఛాన్స్…తెర‌వెన‌క క‌థ ఇదే..!

 

Visitors Are Also Reading