Home » CHANAKYA NITI : చాణక్య నీతి ప్రకారం ఈ రెండు ల‌క్ష‌ణాలు క‌ల్గిన స్త్రీల‌కు దూరంగా ఉండాల‌ట‌..!

CHANAKYA NITI : చాణక్య నీతి ప్రకారం ఈ రెండు ల‌క్ష‌ణాలు క‌ల్గిన స్త్రీల‌కు దూరంగా ఉండాల‌ట‌..!

by AJAY

చరిత్రలో చాణక్యనీతి కి ఎంతో గొప్ప పేరుంది. ఆచార్య చాణ‌క్యుడు మనిషి ఆనందకరమైన జీవితాన్ని గడపాలంటే ఎలా ఉండాలి… ఏం చేయాలి ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి లాంటి అనేక విషయాలను వెల్లడించారు.  రాజకీయ, సామాజిక, నైతిక అంశాలను చాణక్య నీతి ద్వారా వెల్లడించారు. ఇక చాణక్యుడు తన నీతి పుస్తకంలో రెండు లక్షణాలు ఉన్న మహిళకు దూరంగా ఉండాలని చెప్పాడు.

Also Read: ల‌గ్జరీ కారు కొన్న శివ‌జ్యోతి…పైస‌లు లేవంటూనే అంత పెద్ద‌కారు…!

CHANKAYANITI

CHANKAYANITI

బద్ధకం కలిగిన మహిళ
బద్ధకం కలిగిన మహిళలకు దూరంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నాడు. బద్ధకం ఉన్న మహిళను పెళ్లి చేసుకోవడం వల్ల జీవితంలో నరకంలో చూస్తారని చెప్పాడు. బద్ధకం కలిగిన మహిళ పక్కన ఉన్న వాళ్లు కూడా బద్దకంగా తయారవుతారని చెప్పాడు. బద్ధకం కలిగిన వారికి జీవితంలో ఎలాంటి లక్ష్యాలు ఉండవని చెప్పాడు. బద్ధకం వల్ల స్త్రీలలో క్రమశిక్షణ కూడా ఉండదని చాణక్యుడు వెల్లడించాడు. అలాంటి వారితో స్నేహం చేస్తే కాలంతో పాటు మిగతా వాళ్ళు కూడా బద్దకంగా మారిపోతారని చెప్పాడు.


అత్యాశ కలిగిన స్త్రీలు

అత్యాశ కలిగిన స్త్రీలను కూడా జీవిత భాగస్వామిగా చేసుకోకూడదు అని చాణ్యుడు తెలిపారు. అత్యాశ క‌ల్గిన స్త్రీలు తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తారు అని చెప్పాడు. తమ సుఖం సంతోషం కోసం పిల్లల గురించి కూడా ఆలోచించర‌ని తెలిపాడు. అలాంటి వారికి దూరంగా ఉంటేనే మంచిదని పేర్కొన్నాడు. అదేవిధంగా అత్యాశ క‌ల్గిన స్త్రీలు ఎక్కువగా అబద్ధాలు ఆడుతార‌ని తెలిపాడు. అలాంటి వారు తోటివారికి ఎప్పుడైనా ద్రోహం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Also Read: జియో నుంచి అతి చౌక అయిన 5 జీ మొబైల్

Visitors Are Also Reading