Home » జియో నుంచి అతి చౌక అయిన 5 జీ మొబైల్

జియో నుంచి అతి చౌక అయిన 5 జీ మొబైల్

by Anji
Ad

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న జియో మ‌రొక సంచ‌ల‌నంతో ముందుకు రాబోతోంది. ముఖ్యంగా భార‌త్‌లో అత్యంత త‌క్కువ ధ‌ర‌కు జీయో 4 జీ స్మార్ట్ ఫోన్‌ను ఇప్ప‌టికే అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, గూగుల్ భాగ‌స్వామ్యంతో ఈ మొబైల్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇది చ‌వ‌కైన 5జీ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతుంది. భార‌త్‌లో 5 జీ విస్త‌ర‌ణ‌లో జియో ముందంజ‌లో ఉంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే 5 జీ స్మార్ట్ ఫోన్ను విడుద‌ల చేసేందుకు జియో స‌న్నాహాలు చేస్తుంది. రియ‌ల్ మీ, రెడ్ మీ స్మార్ట్ ఫోన్‌ల‌కు పోటీగా రియ‌ల‌న్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్న‌ది. ప్ర‌స్తుతం 5జీ స్మార్ట్ ఫోన్ ధ‌ర భార‌త్‌లో రూ.15వేల వ‌ర‌కు ఉంది.

Advertisement

Jio 5G Phone Coming Soon for Rs 4000; find details

Advertisement

అయితే జియో కంపెనీ తీసుకురాబోయే 5 జీ స్మార్ట్ ఫోన్ ధ‌ర రూ.10వేల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. క్వాల‌కం స్నాప్ డ్రాగ‌న్ 480 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంట‌ర్న‌ర్ స్టోరేజ్‌, 13 ఎంపీ ప్ల‌స్ ఎంపీ రియ‌ర్ కెమెరా, 8 ఎంపీ సెల్పీ కెమెరా, మైక్రో ఎస్‌.డీ కార్ట్ స్లాట్‌, ఎన్ 3, ఎన్ 5, ఎన్ 28, ఎన్ 40, ఎన్ 78 బ్యాండ్ స‌పోర్ట్ 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ స‌పోర్ట్ ఫీచ‌ర్ల‌తో 5 జీ మొబైల్ అందుబాటులోకి రాబోతున్న‌ట్టు స‌మాచారం. దీంతో జియో సిమ్‌, జియో ఫోన్‌ల మాదిరిగానే ఇప్పుడు జియో స్మార్ట్ ఫోన్ల‌కు కూడా గిరాకీ బాగానే ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. జియో స్మార్ట్ ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి మ‌రి.

Visitors Are Also Reading