Home » ల‌గ్జరీ కారు కొన్న శివ‌జ్యోతి…పైస‌లు లేవంటూనే అంత పెద్ద‌కారు…!

ల‌గ్జరీ కారు కొన్న శివ‌జ్యోతి…పైస‌లు లేవంటూనే అంత పెద్ద‌కారు…!

by AJAY
Ad

తీన్మార్ న్యూస్ ద్వారా అభిమానుల‌ను సంపాదించుకున్న యాంక‌ర్ శివ‌జ్యోతి. బిత్తిరిస‌త్తితో క‌లిసి శివ‌జ్యోతి చేసే జోకులు ఆమె క‌ట్టుబొట్టు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. దాంతో చాలా మంది శివ‌జ్యోతిని అభిమానించ‌డం మొదలు పెట్టారు. అయితే శివ‌జ్యోతిని మెచ్చుకున్న‌వారంతా ఆమెను బిగ్ బాస్ లో చూసిన త‌ర‌వాత విమర్శించ‌డం మొద‌లు పెట్టారు. ఈ షోలో శివ‌జ్యోతి 14 వారాలు ఉండ‌గా ఆమె ఓవ‌ర్ యాక్ష‌న్ ను ప్రేక్ష‌కులు భ‌రించ‌లేక‌పోయార‌నే చెప్పాలి.

shivajyoti

shivajyoti

ఇక హౌస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రవాత అస‌లు ఈమె తీన్మార్ శివ‌జ్యోతినేనా అన్నంత‌గా మారిపోయింది ఆమె య‌వ్వారం. క‌ట్టుబొట్టు అన్నీ మారిపోయాయి. ఫ్యాన్సీ డ్రెస్సుల‌తో సోష‌ల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్ట‌డం. ఓ యూట్యూబ్ ఛాన‌ల్ పెట్టుకుని ఎక్క‌డ‌కు వెళ్లినా వీడియోలు తీసి షేర్ చేయ‌డం ఇలా చాలానే చేస్తోంది. ఇక రీసెంట్ గా మాల్దీవుల టూర్ అంటూ భ‌ర్త‌తో క‌లిసి పొట్టి బ‌ట్ట‌లు వేసుకున్న ఫోటోల‌ను షేర్ చేయగా దారుణ‌మైన ట్రోల్స్ వ‌చ్చాయి.

Advertisement

Advertisement

Shivajyothi

Shivajyothi

ఇక ప్ర‌స్తుతం శివ‌జ్యోతి టీవీ 9 లో వార్తలు చ‌దువుతూనే ప‌లు టీవీ కార్య‌క్ర‌మాల ద్వారా ఫుల్ గా సంపాదిస్తోంది. ఇక త‌న భ‌ర్త గంగూలి ని కూడా శివ‌జ్యోతి త‌న టాలెంట్ తో సెల‌బ్రెటీని చేసేసింది. ఏ టీవీషోకు వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసి వెళ్ల‌డం గంగూలీతో కూడా ఆడిపాడించ‌డం ద్వారా అత‌డు కూడా పాపుల‌ర్ అయిపోయాడు. ఇక ఏం చేసినా సోష‌ల్ మీడియా యూట్యూబ్ ల‌లో వీడియోలు పెట్టే శివ‌జ్యోతి తాజాగా కొత్త ల‌గ్జ‌రీ కారును కొన్న‌ట్టు ఫేస్ బుక్ లో ఓ వీడియో షేర్ చేసింది.

shivajyoth

ఈ వీడియో కార్ షోరూంలో తీసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఇక కారును లోన్ తీసుకుని కొన్నాన‌ని నా దగ్గ‌ర అంత డ‌బ్బులు లేవంటూ చెప్పింది. అంతే కాకుండా కార్ షోరూం మేనేజ‌ర్ తో కూడా చెప్పించింది. అయితే ఈ వీడియో గ‌తేడాది శివజ్యోతి త‌న యూట్యూబ్ ఛాన‌ల్ లో అప్లోడ్ చేయ‌గా మ‌రోసారి ఆదాయం కోసం ఫేస్ బుక్ లో కూడా అప్లోడ్ చేసిందంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

https://fb.watch/aMSQVatGXg/

Visitors Are Also Reading