తెలంగాణకు ముఖ్యమంత్రి గా కేసీఆర్ దాదాపు పదేళ్ల కాలం పాటు వ్యవహరించారు. అయితే పదేళ్ల సమయంలో సీఎంగా ఉన్న సమయంలో పలుమార్లు కేసీఆర్ కి అనారోగ్య సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజలు అస్సలు గుర్తుకు రాలేదు. పవర్ చేజారినంతనే గుర్తుకు వచ్చేయటం.. భావోద్వేగాన్ని రగిలించేందుకు ఉన్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకపోవటం ఆసక్తికరంగానే కాదు. . పలు ఎదురు ప్రశ్నలకు తెర తీసేలా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ల పాటు పరిపాలించిన సందర్భంగా వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రులకు వెళ్లటం తెలిసిందే.
Advertisement
ఎప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్లినా.. అక్కడికి ట్రీట్ మెంట్ కి సంబంధించి అధికారికంగా ఒక ప్రెస్ నోట్ కానీ.. వీడియో కానీ ఫోటోలు కాని బయటకు వచ్చేవి కావు. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారో.. అందుకు భిన్నంగా ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడటం.. తుంటి ఎముక విరగడం.. హిప్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కు తరలించే వేళ.. వీడియోల్ని తీసి మరీ షేర్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఎలాంటి వీడియోలు షేర్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు షేర్ చేస్తున్నారు..? పవర్ చేజారగానే ప్రజలు.. ప్రజల భావోద్వేగాలు గుర్తుకొస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Advertisement
అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరికీ టచ్ లో ఉండని కేసీఆర్.. ఇప్పుడు మాత్రం చీమ చిటుక్కుమంటే చాలు.. ఫోటోలను, వీడియోల్ని భారీగా విడుదల చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. సర్జరీ జరిగిన రెండో రోజున.. కేసీఆర్ ను నడిపించేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. వీటికి కేసీఆర్ అనుమతి లేకుండా బయటకు వచ్చేవి కావని.. అలా వచ్చాయంటే ఆయన అంగీకారం ఉందంటున్నారు. ఈ వీడియోలతో ప్రజల్లో సానుభూతి పెల్లుబుకటమే లక్ష్యమని చెబుతున్నారు. గులాబీ దళం అంచనాలకు భిన్నంగా.. ఎదురు ప్రశ్నలు తెర మీదకు వస్తూ.. అప్పుడు చేయని పనులను ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించటం వారికి ఇబ్బందికరంగా మారిందంటున్నారు.
నిన్న జరిగిన తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో.. వైద్యుల పర్యవేక్షణలో నడవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. pic.twitter.com/BYlJqtRtvh
— KTR News (@KTR_News) December 9, 2023