ఆరోగ్యానికి మేలు చేసే చాలా రకాల వస్తువులను మన ప్రకృతి అందిస్తుంది. చాాలా అనారోగ్యాలను మూలికలు పరిష్కారమవుతాయి. గొప్ప ఔషద గుణాలు కలిగిన మొక్కలలో కలబంద ఒకటి. సాధారణంగా దీనిని కొన్ని ఇళ్లల్లో పెంచుకోవడం చూస్తుంటాం. దీని వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అందరూ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని ప్రోడక్ట్ లలో కలబంద నిత్యం వాడే వస్తువులో కలబంద వినియోగిస్తున్నారు. టూత్ పేస్ట్, ఫేస్ షాంపు, బాడీలోషన్, హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్ ఇలా ప్రతీదాంట్లో కలబందను వాడుతున్నారు. కలబందలో ఔషద గుణాలు అధిక పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాల కారణంగా పురాతనం నుంచి ఉపయోగిస్తున్నారు.
Advertisement
Advertisement
ఇందులో విటమిన్ ఏ, సీ, ఈ, బీ6, బీ12, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ సమృద్ధిగా లభిస్తాయి. కలబంద చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతూ.. జిడ్డు తగ్గిస్తుంది. షేవింగ్ తరువాత షేవ్ మాయిశ్చరైజర్ గా వాక్సింగ్ అస్ట్రింజెంట్ గా ఉపయోగించవచ్చు.
ఇందులో ఉండే చల్లదనం యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఎండవేడి నుంచి కాపాడడానికి సహాయపడుతాయి. చర్మంపై సహజంగా రక్షితపొరని ఏర్పాటు చేస్తుంది. సూర్యరశ్మి తగిలిన ప్రదేశాన్ని చల్లబరుస్తుంది. దీనిలోని యాంటి ఆక్సిడెంట్లు నయం చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. కలబంద అనేక ముఖ్యమైన పోషకాలకు మూలం. శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మొక్కలోని ముఖ్యమైన పోషకాలు మచ్చలు, చర్మంపై ముడతలు పిగ్మెంటేషన్ ని తొలగించడంలో సహాయపడుతాయి.
Also Read : భోగి పండుగ రోజు రేగు పళ్లను పోయడానికి కారణం ఏంటో తెలుసా..?