Home » ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లోని వీణ స్టెప్స్ కోసం చిరంజీవి ఎంత సమయం తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా సాంగ్ లోని వీణ స్టెప్స్ కోసం చిరంజీవి ఎంత సమయం తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యారు. అయితే చిరంజీవి కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించిన ఇంద్ర మూవీ గురించి దాదాపు అందరూ చెబుతుంటారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చిది. అశ్వనిదత్ నిర్మించారు. ఆ సమయంలో వచ్చిన తెలుగు సినిమా కలెక్షన్ల కంటే కూడా అత్యదికంగా గ్రాస్ వసూలు చేసింది ఇంద్ర. ఈ మూవీలో ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రె హీరోయిన్లుగా నటించారు.

Advertisement

దాదాపు రూ.10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ సినిమా అప్పట్లో రూ.25కోట్లు వసూళ్లు చేసి ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీలో యాక్షన్ పాటలతో ఎంత పేరు వచ్చిందో అలాగే దాయి దాయి దామ్మ పాటలో వీణ స్టెప్ కూడా అదే రేంజ్ లో పాపులర్ అయింది. నీకు డ్యాన్స్ వస్తే.. వీణ స్టెప్పు వేసి చూపించరా అంటూ సరదాగా ఎవ్వరినైనా ఆట పట్టించడానికి సైతం దీనిని వాడుతారంటే.. అప్పట్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇంతటి హిట్ కావడం వెనుక ఈ సినిమాకి కొరియోగ్రఫీ చేసిన లారెన్స్ కష్టం ఎంతో ఉంది. లారెన్స్ ఒక భిన్న మైన వ్యక్తి. చిరంజీవిని గురువుగా భావించి ఆయన కోసం ఎంతో పద్దతిగా కష్టమైన స్టెప్స్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాటిలో వీణ స్టెప్ కూడా ఒకటి. 

Advertisement

సాధారణంగా ఎవ్వరైనా ఈ వీణ స్టెప్ కోసం ప్రాక్టీస్ చేయాలంటే చాలా కష్టపడుతుంటారు. కానీ చిరంజీవికి దీని కోసం ఎంత సమయం పట్టిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం రెండు సార్లు మాత్రమే ప్రాక్టీస్ చేశారట మెగాస్టార్. మెదటి రెండు సార్లు లారెన్స్ చేయి సహాయం తీసుకొని ప్రాక్టీస్ చేయగా.. మూడో సారికి వచ్చేసిందట. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఈ స్టెప్ చేశారట చిరంజీవి.   ఈ పాటను స్విట్జర్లాండ్ లో తెరకెక్కించారట. ఇక ఈ పాటకు లారెన్స్ నంది అవార్డుతో పాటు ఫిలింపేర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం.

Visitors Are Also Reading