Home » జైస్వాల్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు !

జైస్వాల్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు !

by Anji
Ad

భారత్ నిర్వహించే ఐపీఎల్ లీగ్ ఏ సంవత్సరం ఎవరి జీవితాన్ని మార్చుతుందో మనం అస్సలు ఊహించలేము. ఒక్కో ఏడాది ఒక్కొక్కరి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ ఏడాది టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం యశస్వి జైస్వాల్ కెరీర్ ని మార్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఒకసారి సెంచరీ చేసిన జైస్వాల్ తాజాగా మళ్లీ చెలరేగాడు. కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి రాజస్థాన్ ని విజయతీరాల్లోకి చేర్చాడు. 

Also Read :  BHUVANAVIJAYAM REVIEW : ‘భువనవిజయమ్’ మూవీ ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?

Advertisement

150 పరుగుల లక్ష్య ఛేధనలో ప్రారంభం నుంచే విరుచుకుపడిన జైస్వాల్ కేవలం 47 బంతుల్లో 98 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 5 సిక్సులు ఉండటం విశేషం. జైస్వాల్ కి తోడు సంజూ శామ్సన్ కూడా ధాటిగా ఆడటంతో రాజస్థాన్ 41 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వరుస ఓటములకు చెక్ పెట్టినట్టయింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడోస్థానానికి ఎగబాకింది రాజస్థాన్ జట్టు. దీంతో ప్లే ఆప్ అవకాశాలు మెరుగు అయ్యాయి. మరోవైపు 12 మ్యాచ్ ల్లో ఏడో పరాజయంతో కోల్ కతా ప్లే ఆప్ అవకాశాలు సన్నగిల్లాయి. సునామీ ఇన్నింగ్స్ ఆడి రాజస్థాన్ కి సునాయస విజయం అందించిన యశస్వికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.  

Advertisement

Also Read :  IPL 2023 : ప్లే ఆఫ్స్ లోకి ఈ నాలుగు జట్లు…? SRH డేంజరస్ టీమ్…!

తొలుత కోల్ కతా 20 ఓవర్లలో అతి కష్టం మీద 149 పరుగులు చేసింది. విధ్వంసక బ్యాటర్లకు నెలవైన నైట్ రైడర్స్ ఇంత తక్కువ స్కోర్ చేసిందంటే.. పిచ్ బౌలర్లకు అనుకూలం అనుకున్నారందరూ. కానీ లక్ష్యం చిన్నదైనా ఛేదన అంత తేలిక కాదేమో అనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. తొలుత చాహల్ 4 వికట్లు పడగొట్టగ.. స్పిన్నర్ కెప్టన్ నితీష్ రాణానే కోల్ కతా బౌలింగ్ ప్రారంభించాడు. తొలి ఓవర్ లోనే 6,6,4,4,2,4 యశస్వి జైస్వాల్ ఊచకోత కోశాడు. కేవలం 13 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకొని 16 ఏళ్ళ యశస్వి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థశతకం నమోదు చేశాడు. రెండో ఓవర్లో హర్షిత్ వేసిన మూడు బంతులకు 1, 4,6 పరుగులు చేశాడు. మూడో ఓవర్లో శార్దూల్ బౌలింగ్ లో హ్యాట్రిక్ పోర్లు కొట్టి 49 మీదికి వచ్చేశాడు. ఆ వెంటనే సింగిల్ తో ఐపీఎల్ లో రికార్డు హాఫ్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో 2.5 ఓవర్లకే ఇతని అర్థశతకం పూర్తి అవ్వడం విశేషం. 

Also Read :  IPL 2023 : డేంజర్‌ బెల్స్‌…ధోని బ్యాటింగ్ కు వస్తే..స్టేడియంలో ప్రమాదమే !

Visitors Are Also Reading