Home » IPL 2023 : డేంజర్‌ బెల్స్‌…ధోని బ్యాటింగ్ కు వస్తే..స్టేడియంలో ప్రమాదమే !

IPL 2023 : డేంజర్‌ బెల్స్‌…ధోని బ్యాటింగ్ కు వస్తే..స్టేడియంలో ప్రమాదమే !

by Bunty

ఐపీఎల్ 2023 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన చెన్నై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగవగా… ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు ఆవిరయ్యాయి.

READ ALSO : రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరోల సినిమాలు ఏవో తెలుసా…!

99.9% ఢిల్లీ… ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పకుంది. చివరి మూడు మ్యాచుల్లో ఢిల్లీ గెలిచిన ప్లే ఆప్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం పాయింట్స్ టేబుల్ లో తమ రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇక అటు ఐపీఎల్ 2023 సీజన్ లో మహేంద్రసింగ్ ధోని హవా నడుస్తోంది. కెరీర్ లో ఇదే చివరి సీజన్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ ఆటగాడి ఆటను చివరిసారి చూసేందుకు ప్రేక్షకులు మైదానాలకు ఎగబడుతున్నారు.

READ ALSO : టాలీవుడ్ హీరోకు 10 లక్షల ఫైన్ కట్టిన ఆర్తి అగర్వాల్…చివరికి ఆ పని చేసి…!

KKR vs CSK: Watch Crowd Chant 'Dhoni Dhoni' as Thala Still the Biggest Superstar in Eden Gardens, Follow IPL 2023 Live

అయితే తాజాగా ఢిల్లీతో మ్యాచ్లో ధోని ఫ్యాన్స్ అరాచకానికి అసలు సిసలు డెఫినిషన్ చూపించారు. అవును మీరు విన్నది నిజమే. చెన్నై మ్యాచ్ అంటే చాలు అభిమానులు కోరుకునేది ఒక్కటే ధోని బ్యాటింగ్ కి రావాలి. సిక్స్ లు కొట్టాలి. ఢిల్లీతో మ్యాచ్ లోను అదే జరిగింది. కానీ ధోని గ్రౌండ్ లోకి అడుగుపెట్టగానే స్టేడియంలో ఫ్యాన్స్ అరుపులు, గోలతో సౌండ్ దద్దరిల్లిపోయింది. ఆ విషయమే ఓ అభిమాని స్మార్ట్ వాచ్ గుర్తించింది. మరికాస్త సౌండ్ పెరిగితే చెవులు పోవడం గ్యారెంటీ అని హెచ్చరించింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

Visitors Are Also Reading