Home » World Cup 2023: ఆతిధ్యం ఇస్తున్నా.. భారత్ ఎందుకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదు? అసలు కారణం ఇదే!

World Cup 2023: ఆతిధ్యం ఇస్తున్నా.. భారత్ ఎందుకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదు? అసలు కారణం ఇదే!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తాజాగా వరల్డ్ కప్ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి అభిమానుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వాటిల్లో ఒకటి, ఆతిధ్యం ఇస్తున్నా భారత్ ఎందుకు ఓపెనింగ్ మ్యాచ్ ఆడట్లేదన్న సందేహం. ఇప్పటివరకు సాధారణంగా మేజర్ టోర్నీల్లో ఆతిథ్య దేశం ఓపెనింగ్ మ్యాచ్ ఆడుతూ ఉండడం ఆనవాయితీగా వస్తోంది. మరి భారత్ ఎందుకు ఇలా చెయ్యట్లేదు? అన్న సందేహం మొదలవుతోంది.

Advertisement

ICC షెడ్యూల్ ప్రకారం, క్రికెట్ వన్డే పోరు అక్టోబర్ 5 నుంచి మొదలవ్వబోతోంది. ఆఖరు మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అక్టోబరు 8 ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. నిజానికి ప్రపంచ కప్ చరిత్రని చూస్తే.. ఆతిధ్యం ఇచ్చే దేశాలే ఓపెనింగ్ ఆడాలన్న నియమం ఏమీ లేదు. గతంలో కూడా చాలాసార్లు డిఫెండింగ్ ఛాంపియన్‌లను ఓపెనింగ్ మ్యాచ్ ఆడకుండా ఆతిథ్యమిచ్చిన దేశం అనుమతిచ్చింది.

Advertisement

1992 లో టైటిల్ గెలిచిన పాకిస్తాన్ 1996లో తొలి మ్యాచ్ ఆడలేదు. అలానే 2015 లో టైటిల్ గెల్చుకున్న ఆస్ట్రేలియా కు 2019 లో మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. ఇక పోతే, వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ లు పోటీ పడడం ఇది మూడవసారి. 1983, 1996 సంవత్సరాలలో కూడా ఈ రెండు జట్లు పోటీ పడ్డాయి. గత ఏడాది సీజన్ లో రన్నరప్ అయిన న్యూజిలాండ్, డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచినా ఇంగ్లాండ్ ఈ ఏడాది మొదటి మ్యాచ్ లో తలపడుతున్నాయి. ఈ ఆదివారం భారత్ ఏకంగా ఐదు మ్యాచ్ లు ఆడనుంది. పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా లతో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.

మరిన్ని ముఖ్య వార్తలు:

తెలుగు యాంకర్లను ట్రోల్ చేసిన టాలీవుడ్ కమెడియన్..TV9 దేవిని ఆడేసుకున్నాడుగా ?

Roja : రోజా కొడుకు ఫోటోలు వైరల్‌.. హీరోగా ఎంట్రీ ఇస్తారా?

సచిన్‌ను మోయడమా? ముసలోళ్లం.. మా వల్ల కాదన్నాం: వీరేంద్ర సెహ్వాగ్

Visitors Are Also Reading