Home » రామ్ చరణ్ విషయంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

రామ్ చరణ్ విషయంలో ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

by Anji
Ad

గ్లోబల్  స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విధితమే. ప్రస్తుతం రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కించే గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే బుచ్చిబాబు మూవీని వీలైనంత త్వరగా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి దాదాపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు బుచ్చిబాబు. హీరో రామ్ చరణ్ సూచన మేరకు కొన్ని చిన్న చిన్న మార్పులను చేసే పనిలో ఉన్నాడని తెలుస్తోంది. సినిమా ప్రారంభం కానప్పటికీ ఈ మూవీ నుంచి తరచూ ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూ మూవీపై ఆసక్తి పెంచుతోంది. 

Advertisement

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న రామ్ చరణ్ డ్యుయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్ పై ఆసక్తి పెంచుతుండగా.. తాజాగా మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టిస్తోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. అయితే ఈ మూవీని కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బుచ్చిబాబు ఉప్పెన మూవీ కూడా కోనసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొంది బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. 

Advertisement

 

ఇప్పుడు రామ్ చరణ్ మూవీ కోసం కూడా అదే బ్యాక్ డ్రాప్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి కోనసీమ బ్యాక్ డ్రాప్ వర్కౌట్ అవుతుందా అనే చర్చ ప్రారంభమైంది. RRR మూవీ తరువాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకునే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. బుచ్చిబాబు మూవీ కూడా చరన్ స్టామినాకి ఏమాత్రం తీసిపోకుండా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషన్ కూడా ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న ఈ మూవీపై రామ్ చరణ్ బుచ్చిబాబుకి మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందా లేదా వేచి చూడాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

బేబి మూవీకి హీరోయిన్ వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading