Home » బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. BRO  మూవీ ట్రైలర్ విడుదలైంది. పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ ట్రైలర్ ని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.  ఈ ట్రైలర్ లో మామ, అల్లుడి హంగామా, డైలాగ్స్ అదిరిపోయాయి.  ఈ సినిమా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. తమిళ మూవీ వినోద సీతమ్ కి రీమేక్. ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఈ సినిమా మొత్తం టైమ్ చుట్టు తిరుగుతుందని ట్రైలర్ చూస్తే.. అర్థం అవుతోంది. సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ టైమ్ లో వెనక్కి వెళ్తాడనేలా డైలాగ్ ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. “ భస్మాసురుడు అని ఒకడు ఉండే వాడు తెలుసా.. ఇంకెవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు” అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ వాయిస్ ఓవర్ తో బ్రో ట్రైలర్ ప్రారంభమైంది. టైమ్ లేదు.. టైమ్ లేదు.. అంటూ కాలంతో పరుగెత్తే పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించాడు. టైమ్ ఆఫ్ గాడ్.. అంటే సమయానికి దేవుడి పాత్రను పోషించాడు పవన్ కళ్యాణ్. “  కంగ్రాట్స్ బ్రో.. అందరూ సమయానికి ముందుకు వెళ్తుంటారు.. కానీ నువ్వొక్కడివే టైమ్ లో వెనక్కి వెళ్తున్నావు” అని సాయి ధరమ్ తేజ్ తో పవన్ కళ్యాణ్ చెబుతాడు.

Advertisement

మరోవైపు కమెడీయన్ బ్రహ్మానందం కూడా కనిపించాడు. పవన్ కళ్యాణ్ జల్సా సిగ్నేచర్ మూమెంట్ తో బ్రో ట్రైలర్ ముగిసింది. మొత్తానికి 2 నిమిషాల 15 సెకన్ల పాటు ఈ ట్రైలర్ ని కట్ చేశారు. ముఖ్యంగా ఇద్దరూ మెగా హీరోలను కలిసి చూడాలని ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆచార్య సినిమా దారుణంగా నిరాశపరచడంతో ఇప్పుడు బ్రో మూవీ పై ఆశలు పెట్టుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వేగాన్ని పెంచుతున్నారు చిత్రబృందం. జులై 28న విడుదలయ్యే ఈ మూవీ  ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బేబి మూవీకి హీరోయిన్ వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

పెళ్లికి ముందే తల్లి కాబోతున్న లావణ్య ? వాస్తవమేనా..! 

Visitors Are Also Reading