Home » పాత అంబాసిడర్ మళ్లీ రాబోతుందా.. సరికొత్త లుక్ ఓసారి చూసేయండి..!!

పాత అంబాసిడర్ మళ్లీ రాబోతుందా.. సరికొత్త లుక్ ఓసారి చూసేయండి..!!

by Sravanthi Pandrala Pandrala

దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కార్ అంటే అందరికీ బాగా పరిచయం అయింది. దాని గతమెంతో ఘన మైనది. 1990 వరకు కారు కలిగి ఉండడం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్. కానీ కాలక్రమంలో, టెక్నాలజీలో కొత్త తరం కోసం వచ్చిన మోడ్రన్ కార్లలో కారు కనుమరుగైంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా పీఎం నుండి డిఎం వరకు అందరికీ ఫేవరెట్ కార్ గా నిలిచిన అంబాసిడర్. మళ్లీ ఒక్కసారిగా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పుడు దీన్ని కొత్త అవతారంలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫ్రెంచ్ కార్ కంపెనీ ఫ్యూగాట్ దీని డిజైన్, ఇంజన్ పై పనిచేస్తున్నాయి. హిందుస్థాన్ మోటార్స్ కు సంభందించిన చెన్నై ప్లాంట్ లో అంబాసిడర్ కొత్త మోడల్ తయారు చేయబడుతోంది. ఇది కొత్త అవతారంలో అంబి అని పిలువబడనుంది. ఇది రాబోయే రెండేళ్లలో దేశ వీధుల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత అంబాసిడర్ మాయ తగ్గిపోయింది. చాలా ఏళ్ల పాటు కేవలం ప్రభుత్వ కొనుగోళ్ల తోనే మనుగడ సాగించింది. 2014లో హిందుస్థాన్ మోటార్స్ భారీ అప్పులతో పాటు రిమాండ్ లేని కారణంగా అంబాసిడర్ ఉత్పత్తిని నిలిపివేసింది. అంబి అవతార్ లో అంబాసిడర్ ని తీసుకురావడానికి పని జరుగుతోందని హెచ్ ఎం డైరెక్టర్ ఉత్తం బోస్ వెల్లడించారు. కొత్త ఇంజన్ కోసం మెకానికల్ డిజైన్ వర్క్ అధునాతన దశకు చేరుకుంది.

also read;

బోణీ కపూర్ కంటే ముందు టాలీవుడ్ నుండి శ్రీదేవికి వచ్చిన సంబంధాలు ఏవో తెలుసా…!

కిరాక్ RP కాబోయే భార్య ఎవరో తెలుసా.. మీరు ఎప్పుడు చూడని లేటెస్ట్ ఫొటోస్ వైరల్..?

 

Visitors Are Also Reading