Home » IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్

IPL 2023 : గాయమైనా.. జట్టు కోసం పోరాడిన RCB కెప్టెన్

by Bunty
Ad

ఐపీఎల్ 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మరో ఓటమి చవిచూసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో ఆర్సిబి పరాజయం పాలైంది. బెంగళూరు ఓడిపోయిన ప్రతి కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ మాత్రం అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్ లో మొత్తంగా 33 బంతులు ఎదుర్కొన్న అతడు 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 62 పరుగులు సాధించాడు.

READ ALSO :  టాలీవుడ్‌లో విషాదం.. కమెడియన్ కన్నుమూత

Advertisement

తద్వారా ఐపిఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో కలిపి 259 పరుగులు పూర్తిచేసుకుని అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆరెంజ్ క్యాప్ అందుకొని టాప్ లో కొనసాగుతున్నాడు. కాగా డూప్లేసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్ కు తోడు ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్ వెల్ 36 బంతుల్లో 76 పరుగులతో రాణించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. డెత్ ఓవర్లలో సిఎస్కే బౌలర్లు రాణించడంతో సొంత మైదానంలో ఆర్సిబికి ఓటమి తప్పలేదు.

Advertisement

READ ALSO :  Ileana :పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా….

I was diving around and I thought I went at it with my rib" - Faf du Plessis sheds light on his injury vs CSK in IPL 2023

ఇదిలా ఉంటే, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డుప్లేసిస్ ఫిజియోను వచ్చి అతడి పొట్ట చుట్టూ కట్టు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నొప్పిని పంటి బిగువన భరిస్తూనే కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించేందుకు కృషి చేశాడంటూ RCB ఫ్యాన్స్ డూప్లెసిస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?

Visitors Are Also Reading