Home » SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?

SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు చిరంజీవి. విలన్ గా నటించి తన నటనతో హీరోగా మారాడు. 150కి పైగా చిత్రాల్లో నటించి ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. అంతేకాదు తన కుటుంబంలో నుంచి ఎంతోమందిని హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

Advertisement

ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎంతోమంది డైరెక్టర్స్ సినిమాలు చేశాడు చిరంజీవి. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి, చిరంజీవి కాంబినేషన్లో సినిమా మిస్ అయిందనే సంగతి ఎవరికీ తెలియదు. ఆ సినిమా ఎందుకు మిస్ అయిందో ఇప్పుడు తెలుసుకుందాం… ఎస్వీ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘నేను చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేద్దామని అనుకున్నప్పటికీ కుదరలేదు. చిరంజీవికి రెండు కథలను సిద్ధం చేసి చెప్పాను.

Advertisement

కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా తీయడం కుదర లేకపోయింది. చిరంజీవి గారితో సినిమా అంటే చాలా స్పెషల్ గా ఉండాలి. ఏదో ఒక సింపుల్ కథను తీసుకువచ్చి చిరంజీవి గారితో సినిమా తీయలేము. చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. అందరితో చాలా మర్యాదపూర్వకంగా నడుచుకుంటాడు. నేను నటించిన మొదటి సినిమాకి యాడ్ కూడా చేశారు చిరంజీవి గారు. తనతో ఎప్పటికైనా సినిమా తీయాలి అనేదే నా కోరిక. చిరంజీవి గారు అవకాశం ఇస్తే తనతో తప్పకుండా సినిమా తీస్తాను’ అని ఎస్వి కృష్ణారెడ్డి చెప్పడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు

రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !

Visitors Are Also Reading