Home » అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు

అసలు హర్షసాయి ఎవరు..? ఎలా ఫేమస్ అయ్యాడు

by Bunty
Ad

ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయినటువంటి యూట్యూబర్లలో ముందు వరసలో ఉంటాడు హర్ష సాయి. పేదలకు కడుపునిండా తిండి పెట్టాలని, సాయం చేయాలనే దృక్పథంతో ఎంతోమందికి అండగా ఉంటాడు. ఇది చూసిన నెటిజెన్స్ ఇతనికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంత సాయం ఎలా చేయగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. దేశ విదేశాలలో ఇతని క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది. ఇతని మంచి మనసుకు కొంతమంది ప్రజలు దేవునిగా భావిస్తూ ఉంటారు. అయితే ఇతను యూట్యూబ్లో వారానికి ఒక వీడియోని పెడుతూ పాపులర్ అయిపోతూ ఉంటాడు. కొందరికి ఇల్లు కట్టించడం, షాప్స్ పెట్టించడం, వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు.

Advertisement

అయితే గత రెండు నెలలుగా ఇతను ఎలాంటి వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయలేదు. దీంతో నెటిజెన్స్ డబ్బులు అయిపోయాయా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య అతను మరో వ్యక్తికి పశువుల ఫామ్ ని ఉచితంగా ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఇతని సొంత ఊరు విశాఖపట్నం. మార్చి 8, 1999 లో జన్మించాడు. గీతం యూనివర్సిటీలో బీటెక్ ని పూర్తి చేశాడు. ఇతనికి ఎనిమిది సంవత్సరాల వయసులోనే తన తల్లిని కోల్పోయాడు. దీంతో ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 2018లో హర్ష సాయి ఫర్ యు అనే ఛానల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అతి తక్కువ కాలంలోనే ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు.

Advertisement

చాలామంది ఇంటికి కావాల్సిన సామాగ్రిని అందించేవాడు. దీంతో ఇతను ఇంత సహాయం ఎలా చేయగలుగుతున్నాడు అని చాలామందికి అనుమానం వచ్చింది. అయితే తనకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని…బ్లాక్ మనీ ద్వారా ఇలా సహాయం చేస్తున్నాడని… సహాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. దీంతో హర్ష సాయి తను యూట్యూబ్ కి కంటెంట్ ఇస్తున్నానని తెలిపాడు. తనకు ఎలాంటి రాజకీయ నాయకుల సపోర్ట్ లేదని… తను మంచి చేయడానికి ప్రయత్నిస్తే తన టీం లోని సభ్యులు తనను అణిచివేయడానికి ప్రయత్నాలు చేసేవారట. యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని హర్ష సాయి పేదలకు ఖర్చు చేస్తున్నాడని తన టీం లోని సభ్యులు చెప్పడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

ప్రభాస్ ఫ్యాన్స్ పై రెచ్చిపోయిన శ్రీరెడ్డి.. దమ్ముంటే ఓమ్ రౌత్ ను కొట్టాలంటూ..!

ఇండియా వర్సెస్ పాక్ మధ్య 3 మ్యాచ్ లు.. ఎప్పుడంటే ?

Sudigaali Sudheer : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సుడిగాలి సుదీర్.. పెళ్లికూతురు ఎవరంటే ?

Visitors Are Also Reading