Home » రోహిత్ 2011 ప్రపంచకప్‌ ఆడకుండా ధోనీ కుట్రలు ?

రోహిత్ 2011 ప్రపంచకప్‌ ఆడకుండా ధోనీ కుట్రలు ?

by Bunty
Ad

వన్డే వరల్డ్ కప్ కు అంత సిద్ధమవుతుంది. అక్టోబర్ 15న భారత్ లోనే మెగా ఈవెంట్ మొదలు కాబోతోంది. 2011లో భారత్ లోనే వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిద్యం ఇవ్వబోతోంది. దీంతో వరల్డ్ కప్ ఫీవర్ ఊపేస్తోంది. ఇక ఇదే సమయంలో గత వరల్డ్ కప్ కు సంబంధించిన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి వస్తున్నాయి. 2011 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ ఎందుకు ఆడలేదన్న మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అవుతుంది.

Advertisement

12 ఏళ్ల తర్వాత ఆనాటి సెలెక్టర్ బాంబు పేల్చాడు. ధోని వద్దనుకున్నందుకే 2011 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ లేడని మాజీ సెలెక్టర్ రాజా వెంకట్ ఓపెన్ అయ్యారు. వన్డే వరల్డ్ కప్ కు 15 మందిని ఎంపిక చేయాల్సి ఉండగా… తొలి 14 మంది విషయంలో ధోని ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నాడు. అయితే 15వ ఆటగాడిగా రోహిత్ పేరు చెప్పగానే మహి ఆసక్తి చూపించలేదని చెప్పారు.

Advertisement

అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టన్ మాత్రం తోలుత హిట్ మాన్ పేరు చెప్పగానే ఓకే అన్నాడని గుర్తు చేసుకున్నాడు. అయితే కెప్టెన్ ధోని వద్దనేసరికి గ్యారీ కిర్స్టన్ కూడా మాట మార్చేసాడని అన్నారు. రోహిత్ శర్మకి బదులుగా పీయుష్ చావ్లాకు మహి జై కొట్టాడని అన్నారు. ధోని మాటకి గ్యారీ కిర్స్టన్ కూడా మద్దతు తెలిపాడని ఆనాటి విషయాలను కోచ్ రాజా వెంకట్ పంచుకున్నాడు.

ఇవి కూడా చదవండి 

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

బాయ్‌ ఫ్రెండ్‌ ను పరిచయం చేసిన సమంత..త్వరలోనే రెండో పెళ్లి ?

బాలకృష్ణ రవితేజ మధ్య గొడవేంటి..? బాలయ్య నిజంగానే కొట్టాడా..?

Visitors Are Also Reading