Home » ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉన్నా రాజమౌళి గౌతమ్ రాజును ఎడిటర్ గా ఎందుకు పెట్టుకోలేదో తెలుసా ..?

ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉన్నా రాజమౌళి గౌతమ్ రాజును ఎడిటర్ గా ఎందుకు పెట్టుకోలేదో తెలుసా ..?

by AJAY
Published: Last Updated on
Ad

రీసెంట్ గా ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. గౌతమ్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పని చేశారు. ఆయన కెరీర్లో మొత్తం 850 కి పైగా సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి అభిమానులను సంపాదించుకున్నారు. అయితే రాజమౌళికి గౌతమ్ రాజుకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కానీ రాజమౌళి సినిమాలకు మాత్రం గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేయలేదు. దాని వెనుక ఒక కారణంతో కూడా ఉంది.

Also Read: పురుషులు ఎక్కువగా గూగుల్ లో వెతికే విషయాలు ఇవేనేట…!

Advertisement

రాజమౌళి అసిస్టెంట్ దర్శకుడిగా మారకముందు ముందు 24 క్రాఫ్ట్స్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గౌతమ్ రాజు వద్ద ఎడిటింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా శిక్షణ తీసుకున్న అనంతరం సీరియల్ కు దర్శకత్వం వహించడం… ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్ హిట్ కొట్టడం జరిగింది.

Advertisement

Also Read: స‌ర్కారు వారి పాట‌లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యార‌బ్బా..!

ఇక ఆ తర్వాత జక్కన్న ప్రస్థానం గురించి తెలిసిందే. అయితే జక్కన్న కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్లు సినిమాలు తెరకెక్కించినా కూడా గౌతమ్ రాజు ఒక్క సినిమాకు కూడా ఎడిటర్ గా పని చేయకపోవడానికి ఓ పెద్ద కారణమే ఉందని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

తను గౌతమ్ రాజు వద్ద ఎడిటింగ్ లో శిక్షణ తీసుకున్నానని కాబట్టి ఆయన తనకు గురువు అవుతారని చెప్పారు. గురువు స్థానంలో ఉన్న ఆయనను ఎడిటర్ గా పెట్టుకుంటే దర్శకుడి హోదాలో అజమాయిషి చెల్లించవలసి వస్తుందని ఆ కారణం చేతనే గౌతమ్ రాజుతో పని చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

ALso Read: డార్లింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

Visitors Are Also Reading