Home » స‌ర్కారు వారి పాట‌లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యార‌బ్బా..!

స‌ర్కారు వారి పాట‌లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్స‌య్యార‌బ్బా..!

by AJAY
Ad

మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమా ఇటీవ‌ల విడ‌ద‌లై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా బ్యాంకుల వ‌ద్ద బ‌డాబాబ‌లు అప్పులు తీసుకోవ‌డం అవి ఎగ్గొట్టడం వ‌ల్ల మ‌ధ్య త‌ర‌గతి పేద ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం ప‌డ‌టం అనే కాన్స‌ప్ట్ నేప‌థ్యంలో తెర‌కెక్కించింది.

Also Read: ఆషాఢమాసం లో అత్త కోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదు అంటారు ! దానికి కారణాలు ఏంటి ?

Advertisement

 

అయితే సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికి క‌లెక్ష‌న్ లు మాత్రం భారీగానే వ‌చ్చ‌య‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రోవైపు అవి ఫేక్ క‌లెక్ష‌న్స్ అని కూడా ఓ టాక్ ఉంది. ఇదిలా ఉంటే సినిమాలు థియేట‌ర్ లో విడుద‌లైన అతి కొద్ది రోజుల‌కే ఓటీటీలో కూడా విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సర్కారు వారి పాట సినిమా కూడా త్వ‌ర‌గానే ఓటీటీలోకి వ‌చ్చింది. ఇక ఓటిటి ప్రేక్ష‌కులు మాత్రం ఈ సినిమా కు ఫిదా అవుతున్నారు.

Also Read: డార్లింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

Advertisement

కొన్ని సినిమాలు థియేట‌ర్ లో బోర్ కొట్టినా ఓటిటిలో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు స‌ర్కారు వారి పాట సినిమా ప‌రిస్థితి కూడా అలానే ఉంది. అయితే థియేట‌ర్ లో సినిమా చూసేట‌ప్పుడు ప్రేక్ష‌కులు పెద్ద‌గా గ‌మ‌ణించ‌రు గానీ ఓటిటి లో సినిమా చూసేట‌ప్పుడు మాత్రం ప్ర‌తి సీన్ ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. అంతే కాకుండా మిస్టేక్ ల‌ను గుర్తించి ట్రోల్ చేస్తున్నారు.

ఇక స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేశ్ బాబు జైలులో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని న‌ర్జియా వ‌ద్ద‌కు విల‌న్ ను తీసుకువెళ్లే సీన్ ఉంటుంది. వ‌చ్చేట‌ప్పుడు పండ్లు కూడా తీసుకురావాల‌ని విల‌న్ కు మ‌హేశ్ బాబు ఫోన్ లో చెబుతాడు. ఇక విల‌న్ పండ్లు తీసుకురాగా మ‌హేశ్ బాబు న‌ర్జియాను తీసుకోవాల‌ని జైలు కిటికి వ‌ద్ద పెడ‌తాడు. కానీ ఆ కిటికి వ‌ద్ద అస‌లు పండ్లు తీసుకునేందుకు స్పేస్ లేదు. దాంతో అక్క‌డ స్పేస్ లేదు పండ్ల‌ను ఎలా తీసుకుంటారు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

Also Read: అతడు సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ హీరోగా అనుకున్నారట… మురళి మోహన్ మరి ఎందుకు తియ్యలేదంటే ?

Visitors Are Also Reading