Home » డార్లింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

డార్లింగ్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

by AJAY
Ad

ప్రభాస్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో డార్లింగ్ సినిమా కూడా ఒకటి. ఈ ప్రేమకథా చిత్రంలో ప్రభాస్ కి జోడిగా కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాతోనే యూత్ లో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Also Read:  ఇంతవరకు మీరు ఎప్పుడూ చూడని టాలీవుడ్ విలన్ ల అందమైన భార్యల ఫోటోలు…!

Advertisement

అయితే ఇదే సినిమాలో కాజల్ అగర్వాల్ కు తమ్ముడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రభాస్ ను ఆటపట్టిస్తూ ఉండే అతడి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు గౌరవ్ కాగా మొట్టమొదటిసారిగా డాక్యుమెంటరీలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా గౌరవ్ చిన్నప్పుడే ఎన్నో స్టేజ్ షోలలో నటించేవాడు.

Also Read: అల్లూరి విగ్రహావిష్కరణ ఆహ్వానం వెనక ఇంత కథ ఉందా.. ఆ ప్లాన్ వేసింది చిరు కోసమేనా..?

Advertisement

అలా నటనపై ఉన్న ఆసక్తితో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటగా రవితేజ హీరోగా నటించిన బలాదూర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నాడు. గౌరవ్ 20కి పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ డార్లింగ్ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆఫర్లు అందుకున్నాడు. అదేవిధంగా మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమాలో మహేష్ బాబుకు తమ్ముడుగా గౌరవ కనిపిస్తాడు.

Also Read: నాగచైతన్య సమంత విషయంలో అమల ఇంత పని చేసిందా..ఆమె వల్లే విడాకులా..?

ఇక గౌరవ్ సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. డార్లింగ్ సినిమాకు ఇప్పటికీ గౌరవ్ పూర్తిగా మారిపోయాడు. అంతేకాకుండా తనకు హీరో అవ్వాలని ఉందని చెబుతున్నాడు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్య్యారు. మరి గౌరవ్ హీరోగా సక్సెస్ అవుతాడా లేదా అన్నది చూడాలి.

Visitors Are Also Reading