అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలనటిగా తన కెరీర్ ప్రారంభించింది శ్రీదేవి. ఇక ఆ తరువాత చాలా మంది అగ్ర హీరోలతో కలిసి నటించింది. టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన బాలకృష్ణ కూడా బాలనటుడిగానే తన సినీ కెరీర్ ప్రారంభించాడు. చాలా మంది హీరోయిన్లతో నటించిన బాలయ్య.. శ్రీదేవితో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
Advertisement
1978లో పదహారేళ్ల వయస్సులో హీరోయిన్ గా కనబడింది. చాలా తెలుగు సినిమాలను చేసింది. 1970లో వచ్చిన మా నాన్న నిర్దోషి మూవీలో బాలనటిగా కనిపించి అలరించింది. బాలయ్య 1974 నుంచి బాలనటుడిగా సినిమాలు చేయడం ప్రారంభించారు. తాతమ్మ కల సినిమాతో బాలకృష్ణ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఆ తరువాత మంగమ్మగారి మనవడు, భలేదొంగ వంటి చాలా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Advertisement
టాలీవుడ్ హీరోలు అయినటువంటి చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల సరసన నటించింది. కానీ బాలయ్యతో మాత్రం సినిమా చేయలేదు. దాని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అది ఏంటంటే.. రాఘవేంద్రరావు 1987లో బాలకృష్ణ శ్రీదేవితో కాంబోలో ఓ సినిమా చేయాలనుకున్నారు. సినిమాని అనౌన్స్ చేశారు. ఆ మూవీ పేరు సామ్రాట్ అని ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే.. 1989లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో భలేదొంగ తీసుకురావాలనుకున్నారు. కానీ అందులో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. శ్రీదేవి ఫుల్ బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో బాలయ్య పక్కన నటించలేదు శ్రీదేవి.కానీ కొంటె కృష్ణుడు, రౌడి రాముడు, అనురాగ దేవత వంటి సినిమాల ఫ్రేమ్ లో కనిపించారు బాలకృష్ణ, శ్రీదేవి. కానీ వీరిద్దరూ కలిసి జంటగా ఏ సినిమాలో నటించలేదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఫస్ట్ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సినీ ప్రముఖులు వీరే..!
ఎన్టీఆర్ కుటుంబంలో ఎంత మంది మరణించారో తెలుసా ?